నాని గ్యాంగ్ లీడర్ సూపర్ హిట్ అనాలంటే ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి

నిన్న విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. ఊహించిన స్థాయి అప్రిసియేషన్ మాత్రం లభించలేదు. ముఖ్యంగా జనాలందరూ.. “ఇది విక్రమ్ కుమార్ రేంజ్ సినిమా కాదు. స్క్రీన్ ప్లే మ్యాజిక్ అనేది ఎక్కడా కనిపించలేదు” అని చెబుతుండడం సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “ఎం.సి.ఏ” 30 కోట్లు వసూలు చేసింది. అలాంటిది “గ్యాంగ్ లీడర్” ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపుగా 30 కోట్లు అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అని కానీ బ్లాక్ బస్టర్ అని కానీ డిక్లేర్ చేయాలంటే కనీసం 35 నుంచి 40 కోట్లు వసూలు చేయాలి. ప్రెజంట్ సినిమా బుకింగ్స్ స్పీడ్ ని బట్టి అంత వసూలు చేసే అవకాశాలైతే కనిపించడం లేదు.

మరి నాని & గ్యాంగ్ ఈ చిత్రాన్ని ఎలా హిట్ గా మలుస్తారో చూడాలి. ఇకపోతే.. సినిమా సక్సెస్ క్రెడిట్ వచ్చినా రాకపోయినా.. హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్, విలన్ గా నటించిన కార్తికేయలకు మాత్రం మంచి పేరు వచ్చింది. మరి నాని కమర్షియల్ హిట్ ఎప్పుడు కొడతాడో చూడాలి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus