Captain Miller Review in Telugu: కెప్టెన్ మిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ధనుష్ (Hero)
  • ప్రియాంక అరుల్ మోహన్ (Heroine)
  • శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ తదితరులు.. (Cast)
  • అరుణ్ మతేశ్వరన్ (Director)
  • సెంథిల్ త్యాగరాజన్ - అర్జున్ త్యాగరాజన్ (Producer)
  • జి.వి.ప్రకాష్ కుమార్ (Music)
  • సిద్ధార్ధ నూని (Cinematography)
  • Release Date : జనవరి 26, 2024

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ధనుష్ నటించిన తమిళ చిత్రం “కెప్టెన్ మిల్లర్”. ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నప్పటికీ.. థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో రెండు వారాలు లేటుగా జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అక్కడ యావరేజ్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: అగ్నీశ్వర (ధనుష్) ఓ సాధారణ వ్యక్తి. సొంత ఊరిలో తక్కువ జాతి వాడంటూ తాను ఎదుర్కొంటున్న వివక్షను అణగదొక్కాలనే ధ్యేయంతో బ్రీటీష్ ఆర్మీలో జాయినవుతాడు. కానీ.. ఆర్మీలో చేరిన కొత్తలోనే కొందరు భారతీయ పోరాటయోధుల్ని కాల్చి చంపి, అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. కట్ చేస్తే.. తన పంధా మార్చుకొని విప్లవకారులకు సహాయం చేయాలని నిశ్చయించుకొని, బ్రిటీష్ ఆర్మీకి ఎదురెళ్తాడు.

ఈ క్రమంలో 600 ఏళ్ల ఒక దేవుడి విగ్రహం అగ్నీశ్వర ప్రయాణాన్ని మారుస్తుంది. ఓ సాధారణ సోల్జర్ నుండి కెప్టెన్ మిల్లర్ గా అగ్నీశ్వరుడి ప్రయాణం ఎలా సాగింది? అతడు చేసిన మహా యుద్ధంలో తోడుగా నిలిచింది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే “కెప్టెన్ మిల్లర్” చిత్రం.

నటీనటుల పనితీరు: ధనుష్ మరోమారు తన కెరీర్ బెస్ట్ యాక్షన్ తో అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్ లో ధనుష్ నటన & బాడీ లాంగ్వేజ్ అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అణగారిన వర్గానికి చెందిన యువకుడిగా, కెప్టెన్ గా, విప్లవకారుడిగా విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రను అద్భుతంగా పోషించాడు. సందీప్ కిషన్ రెగ్యులర్ సపోర్టింగ్ రోల్ తరహాలో కాకుండా.. మంచి ఇంపాక్ట్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. శివరాజ్ కుమార్ క్లైమాక్స్ ఎంట్రీకి భారీ స్థాయిలో విజిల్స్ పడతాయి.

ప్రియాంక మోహన్ పాత్ర బాగున్నప్పటికీ.. ఆ పాత్ర బరువును ఆమె మోయలేకపోయింది. అందువల్ల ఆమె క్యారెక్టర్ సరైన స్థాయిలో పండలేదు. బ్రిటిష్ విలన్లుగా నటించినవారందరూ ఆల్రెడీ ఇప్పటికే ఆ తరహా పాత్రలు పోషించి ఉండడంతో.. వాళ్ళ క్యారెక్టర్స్ రిపిటీటివ్ గా అనిపించాయి.

సాంకేతికవర్గం పనితీరు: జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం, సిద్ధార్ధ్ నూని సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్ అని చెప్పాలి. జి.వి.ప్రకాష్ సంగీతం ఎలివేషన్స్ కు భారీస్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, సిద్ధార్డ్ నూని కెమెరా వర్క్ ఆ ఇంపాక్ట్ ను డబుల్ చేసింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ను అతడు కంపోజ్ చేసుకున్న విధానం మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ వంటివన్నీ సినిమాకి మంచి ఆథెంటిసిటీ యాడ్ చేశాయి.

దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ సినిమాను ఒక వర్గ విబేధం నుండి దేశం కోసం పరితపించే సాయుధపోరాటంగా మార్చిన విధానం బాగుంది. యాక్షన్ బ్లాక్స్ ను చాలా చక్కగా ప్లేస్ చేసుకున్నాడు. కాకపోతే.. సరైన ఎమోషన్ వర్కవుటవ్వలేదు. అందువల్ల సినిమాకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. సో, కథకుడిగా బొటాబోటి మార్కులతో సరిపెట్టుకున్న అరుణ్, దర్శకుడిగా మాత్రం తన సత్తా చాటుకున్నాడు.

విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్తే.. యాక్షన్ సీన్స్ & ఎలివేషన్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ యాక్షన్ కి జీవి.ప్రకాశ్ కుమార్ సంగీతం తొడవ్వడం మరో ప్లస్ పాయింట్. ఎలాగూ థియేటర్లలో వేరే ఆప్షన్ లేదు కాబట్టి, యాక్షన్ & మాస్ సినిమా లవర్స్ కి “కెప్టెన్ మిల్లర్” మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.

రేటింగ్: 2.5/5

Click Here to Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus