Captain Miller Twitter Review: ‘కెప్టెన్ మిల్లర్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. తమిళంలో ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో జనవరి 26న అంటే మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది అని ముందుగా ప్రకటించారు. కానీ తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో.. థియేటర్ల సమస్య వల్ల డిలే అయ్యింది.

అయితే జనవరి 26న హాలిడే కూడా ఉండటం వల్ల ఈ సినిమాకు కొంత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, అలాగే టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కూడా నటించడం అనేది స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ కొన్ని చోట్ల ‘కెప్టెన్ మిల్లర్’ షోలు వేయడం జరిగింది. సినిమా చూసిన తర్వాత కొంతమంది నెటిజెన్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయిందని, అసలు కథలోకి వెళ్లే టైంకి ఇంటర్వెల్ ఎపిసోడ్ వచ్చేసింది అని అంటున్నారు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అట. ఇక సెకండ్ హాఫ్ మెయిన్ ప్లాట్ ని టచ్ చేసినప్పటికీ.. కొంతవరకు కన్ఫ్యుజింగ్ గా అనిపించింది అని అంటున్నారు. అయితే క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ .. శివరాజ్ కుమార్, సందీప్ కిషన్..ల కేమియోలు.. మంచి హై ఇస్తాయి అంటున్నారు. మొత్తంగా ఒకసారి చూడదగ్గ సినిమా (Captain Miller) అని అంతా చెబుతున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus