మరణం ఎప్పుడు ఏ రూపంలో సంభవిస్తుందో ఎవరికి తెలియదు. చిన్న వయసులోని ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరణిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హాలీవుడ్ నటి సమంత (28) అతి చిన్న వయసులోనే క్యాన్సర్ తో బాధపడుతూ మరణించారు. ప్రస్తుతం ఈ విషయం అందరినీ ఎంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. గత రెండున్నర సంవత్సరాలుగా ఈమె అండాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నారు.
ఇలా రెండున్నర సంవత్సరాలుగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి సమంత మే 14వ తేదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈమె మరణ వార్త తెలియడంతో హాలీవుడ్ సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
10 సంవత్సరాల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత 2005వ సంవత్సరంలో బిగ్ గర్ల్ జోసెఫిన్ పాత్ర ద్వారాప్రేక్షకులను సందడి చేశారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె 2002 అక్టోబర్ లో మైకేల్ నుట్సన్ వివాహం చేసుకున్నారు.ఇక మే ఒకటవ తేదీ తన భర్తతో కలిసి సరదాగా గడిపిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఇది ఆఖరి పోస్ట్ అని తెలుస్తుంది.
ఇక అనారోగ్యంతో బాధపడుతూ ఈమె మరణించడంతో తన తల్లిదండ్రులు ఈమె మరణం పట్ల ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. సమంత తండ్రి తన కుమార్తె మరణం పై స్పందిస్తూ తను ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచిస్తుందని తనతో కాసేపు మాట్లాడిన మనకు పాజిటివ్ వైబ్స్ వస్తాయని తెలియజేశారు. సమంత మరణం తమ జీవితాలను పూర్తిగా మార్చేసింది అంటూ ఎమోషనల్ అయ్యారు.