Karate Kalyani: సినీ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ పై పోలీస్ కేసు!

సినిమాలు, సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కరాటే కళ్యాణి.. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది. ఇప్పుడు ఈమెపై జ‌గ‌ద్గిరిగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైనట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో ఉండే కరాటే కళ్యాణి ఈసారి పోలీస్ కేసుతో వార్తల్లో నిలిచింది. ఓ హత్య కేసులోని సాక్ష్యాలను కళ్యాణి వెల్లడించే ప్రయత్నం చేసినట్లు జ‌గ‌ద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఆమెపై కేసు నమోదు చేశారు.

కొన్నిరోజుల క్రితం సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసి చంపేశారు. ఆ హత్యకు సంబంధించిన వివరాలను కళ్యాణి వెల్లడించే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి ఏల్ల‌మ్మ బండ‌లోని తూటం శెట్టి నితేష్ అనే వ్య‌క్తి రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రైవేటుగా కంప్లైంట్ దాఖ‌లు చేశారు. ఈ కంప్లైంట్ ను పరిశీలించిన కోర్టు కరాటే కళ్యాణిపై కేసు నమోదు చేయాలని జ‌గ‌ద్గిరిగుట్ట పోలీసులను ఆదేశించింది.

దీంతో పోలీసులు కరాటే కళ్యాణిపై కేసు నమోదు చేశారు. టాలీవుడ్ లో రెండు వందలకు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. సీరియల్స్ లో నటిగా గుర్తింపు సంపాదించుకున్న కరాటే కళ్యాణి అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ పాల్గొన్న ఆమె రెండో వారంలోనే ఇంటి నుంచి బయటకి వచ్చేసింది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus