‘అల వైకుంఠపురములో’ చిత్ర బృందం పై యూసఫ్ గూడా పోలీసులు కేసు..!

  • January 9, 2020 / 02:07 PM IST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతుంది. త్రివిక్రమ్, బన్నీ హ్యాట్రిక్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘గీత ఆర్ట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం కచ్చితంగా బన్నీ కెరీర్లో 100 కోట్లకు పైగా షేర్ ను రాబడుతుందని చిత్ర యూనిట్ చాలా ధీమాగా చెబుతున్నారు.

ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బదులు.. ‘అల వైకుంఠపురములో మ్యూజిక్ కన్సర్ట్’ అంటూ ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని యూసఫ్ గూడా.. పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈవెంట్ కు 5 వేల మందికి పర్మిషన్ ఇస్తే.. చిత్ర యూనిట్ సభ్యులు 15 వేల మంది వరకూ వచ్చేలా పాస్ లు అవి సిద్ధం చేసుకున్నారట. అంతేకాదు రాత్రి 10 గంటల లోపే కార్యక్రమాన్ని ముగించాలని ముందే చెప్పి పెర్మిషన్ ఇచ్చినప్పటికీ.. రాత్రి 11:30 నిమిషాలకు వరకూ జరిపారు. ఈ కారణాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని పోలీసులు నిర్మాతల పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus