Hero Arya: ఆర్యపై కేసు నమోదు చేసిన శ్రీలంక యువతి!

  • August 11, 2021 / 06:22 PM IST

కోలీవుడ్ డైరెక్టర్ నటుడు ఆర్య ఊహించని విధంగా ఒక చీటింగ్ కేసులో చెన్నై పోలీసులు ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు పోలీస్ విచారణలో పాల్గొన్నాడు. మొదట అతను పోలీస్ స్టేషన్ కు ఎందుకు వచ్చాడు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వెలువడ్డాయి. అనంతరం అతనిపై ఒక యువతి చీటింగ్ కేసు నమోదు చేసినట్లు అసలు విషయం బయటకు వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని అంతేకాకుండా తన నుంచి 70 కూడా తీసుకున్నట్లు పిర్యాదులో పేర్కొంది.

శ్రీలంకకు చెందిన ఒక యువతి జర్మనీ నుంచి ఆన్లైన్ ద్వారా ఈ కేసును అర్యపై నమోదు చేసినట్లు సమాచారం. కొన్నేళ్ళ క్రితం ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద భారీగా డబ్బును కూడా తీసుకున్నట్లు ఆ కేసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్యతో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్స్ ను కూడా ఆ యువతి పోలీసులకు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసుపై ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం తగిన ఆధారాలు సేకరించి విచారణ కొనసాగించాలని చెన్నై పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.

ఇక విచారణలో భాగంగా ఆర్య మంగళవారం చెన్నై పోలీసులు ఎదుట హాజరయ్యాడు. మూడు గంటలకు పైగా విచారణలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును కోర్టు ఈ నెల 17న మరోసారి సమీక్షించనుంది. ఇటీవల నటుడు ఆర్య సర్పట్టా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓటీటీ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆర్య 2017 లో హీరోయిన్ అయేశాని ప్రేమించి చేసుకున్నాడు. రీసెంట్ గా వీరికి కూతురు కూడా జన్మించింది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus