వివరాల్లోకి వెళితే.. ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతలు అయినటువంటి నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ అలాగే స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) , దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma)..ల పై నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు నమోదైంది. ప్రముఖ న్యాయవాది మామిడాల తిరుమల రావు వాళ్ళ పై కేసు పెట్టినట్లు స్పష్టమవుతుంది. విషయం ఏంటంటే.. ‘జై హనుమాన్’ (Jai Hanuman) సినిమా థీమ్ సాంగ్ ను రెండు నెలల క్రితం అంటే.. 2024 చివర్లో విడుదల చేశారు. అందులో హనుమంతుని పాత్ర చేస్తున్న రక్షిత్ శెట్టి ని చూపించారు.
అయితే హనుమంతుని ముఖచిత్రం బదులు హీరో రిషబ్ శెట్టి మొహం చూపించడాన్ని కొందరు తప్పు బట్టారు. అందులో న్యాయవాది మామిడాల తిరుమల రావు కూడా ఒకరు.’భవిష్యత్ తరాలకు హనుమంతుడు అంటే ఎవరో అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది.. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే’ అంటూ దీనిని ఖండిస్తూ ఆయన కేసు వేసినట్టు స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది.
దీనిపై ‘మైత్రి’ వారు, దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో రిషబ్ శెట్టి.. ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ (Hanu Man) సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ రూపొందుతుంది. ‘శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి?’ అనే థీమ్ తో ‘జై హనుమాన్’ రూపొందనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.