ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదాల ద్వారా ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలిచిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఎంతో కష్టపడి తన కొడుకు విష్ణు అధ్యక్ష పదవికి ఎన్నిక కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యారు. అయితే నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు మోహన్ బాబుపై బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో మోహన్ బాబు ” మా ఎన్నికలలో ఘర్షణ ఏమిటి.. ఈ గొడవలు ఏమిటి.. అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్.. గొర్రెలు మేపుకునే వాళ్ల దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని అందరూ చూస్తున్నారు” అని చెప్పుకొచ్చారు. అయితే మోహన్ బాబు చేసిన కామెంట్లు గొర్రెలకాపరులను కించపరిచే విధంగా ఉన్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ వారు ఫిర్యాదు చేశారు.
కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు సరికావని సినిమా హీరోలకు గొర్రెల కాపరులు అంటే గౌరవం పోతుందని చెప్పుకొచ్చారు. గొర్రెల, మేకల పెంపకందారుల సభ్యులైన రాము, లాలయ్య, గంగరాజు పోలీస్ స్టేషన్ కు హాజరై మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు. గొర్రెల కాపరుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు. నమోదైన కేసు విషయంలో మోహన్ బాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!