ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా పై మరో కేసు నమోదైంది. ఈ సినిమాలో హిందువుల పద్దతులను తక్కువ చేసి చూపించారని, అలాగే ఇండియన్ ఆర్మీని కూడా అవమానించారు అని భావించి ఢిల్లీ లాయర్ వినీత్ జిందాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు లాల్ సింగ్ చడ్డా సినిమాలో మానసిక వైకల్యం కలిగిన హీరోని ఆర్మీలోకి ఎలా తీసుకున్నారు. పైగా అతను కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నట్లు కూడా చూపించారు.
ఆర్మీ రూల్స్ ప్రకారం అత్యుత్తమ శిక్షణ తీసుకున్న వారిని మాత్రమే యుద్దానికి పంపిస్తారు. అంతేకాదు యుద్ధం లో పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తిని హీరో తీసుకొచ్చి ప్రాణం పోస్తాడు. అతని రెండు కాళ్ళు పోయినప్పటికీ అతను ఇండియన్ ఆర్మీ ఫోర్స్ నుండీ తప్పించుకున్నట్టు చూపిస్తారు. పైగా కొన్నాళ్ళ తర్వాత హీరోతో కలిసి అతను బిజినెస్ చేసినట్టు, ఓ మ్యాగ్జైజైన్లో కూడా అతని ఫోటో వచ్చినట్టు చూపిస్తారు. అప్పుడు ఆర్మీ వాళ్ళు అతన్ని పట్టించుకోనట్టు చూపించారు.
ఇవన్నీ ఆర్మీ వారిని అవమనించినట్టే అని వినీత్ ఫిర్యాదు లో పేర్కొన్నాడు. ఇక నిన్న(ఆగస్టు 11న ) విడుదలైన లాల్ సింగ్ చడ్డా చిత్రం ఫ్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కనీసం ఓపెనింగ్స్ ను కూడా ఈ మూవీ రాబట్టలేకపోతుంది. ఈ మూవీలో నాగ చైతన్య కూడా బాలరాజు అనే ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?