Fahadh Faasil: చిక్కులో పడ్డ పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్.!

‘పుష్ప’ (Pushpa) విలన్ పై కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) హీరోగా ‘పెయిన్కిలీ’ అనే సినిమా రూపొందుతుంది. ఈ చిత్రం షూటింగ్ కేరళలోని ఎర్నాకులం సమీపంలో ఉన్న ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చిత్రీకరించారట. అయితే కీలక సన్నివేశాలను ఎమర్జెన్సీ వార్డులో చిత్రీకరించాల్సి వచ్చింది. ఇదే టైంలో అత్యవసర చికిత్స కొరకు వేచి చూస్తున్న రోగులను చిత్ర యూనిట్ సభ్యులు లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదట. దీంతో మానవ హక్కుల సంఘం ఫహాద్ ఫాజిల్ అండ్ టీంపై కేసు నమోదు చేసింది.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్యం అందనివ్వకుండా సినిమా కోసం ఆపడమేంటి? అంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారట. మరోపక్క హాస్పిటల్లో ఉన్న వస్తువులను కూడా పాడు చేసినట్టు వైద్యులు కూడా చిత్ర బృందం పై ఆరోపణలు చేశారట. అయితే నిర్మాతలు ఆ ఆరోపణలను కొట్టిపారేశారట. హాస్పిటల్ సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకున్నాకనే షూటింగ్ చేసినట్టు వారు చెబుతున్నారు. దీని పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక ఫహాద్ ఫాజిల్.. ‘విక్రమ్’ (Vikram) సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. పుష్ప పార్ట్ 1 లో ఇతను మెయిన్ విలన్ గా క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ పార్ట్ లో ఇతని పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. మరోపక్క ఇతను హీరోగా వచ్చిన ఆవేశం సినిమా తెలుగులో డబ్ అవ్వకపోయినా చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూశారు. దీనిని బట్టి తెలుగులో ఫహాద్ కి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus