ఓటు హక్కు వినియోగించుకోమంటున్న తారలు!

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ లకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల కోసం భారీ ఎత్తున ప్రచారాన్ని చేపట్టాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు మన హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలంటూ సోషల్‌ మీడియా వేదికగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారానికి తెరపడింది. డిసెంబ‌ర్ 1 అంటే ఈ రోజు పోలింగ్ మొద‌లైంది. ఉద‌యం 7 గంట‌ల నుండే ఓటింగ్ ని మొదలుపెట్టారు.

సెలబ్రిటీల్లో ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ జూబ్లీక్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఆ తరువాత నాగార్జున, ఆయన భార్య అమల త‌మ ఓటు హ‌క్కుని వినియోగించుకున్నారు. నటి మంచులక్ష్మీ ఎఫ్ఎన్ సీసీ లో ఏర్పాటు చేసినపోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తనికెళ్ల భరణి, పరుచూరి గోపాలకృష్ణ దంపతులు, విజయ్ దేవరకొండ తదితరులు కుటుంబ సమేతంగా ఓటు వేశారు. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

అయితే ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కావడం లేదు. క‌రోనా భ‌యంతో చాలా మంది ఇంటి నుంచి బ‌య‌టికి రావ‌డానికి జంకుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నగరంలో 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 9,101 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus