రెండేళ్ల క్రితం అంటే 2021 లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా ఓటీటీలో(డిస్నీ ప్లస్ హాట్ స్టార్) లో నేరుగా రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమాని గ్రామీణ నేపథ్యంలో చేసిన రా అండ్ ఇంటెన్స్ మూవీ అనుకున్నారు. కానీ ఇందులో చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ లు వస్తాయి. దీంతో ఈ సినిమాకి సెకండ్ పార్ట్ గా ‘మా ఊరి పొలిమేర 2 ‘ ని రూపొందించాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్.
సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరీ కృష్ణ నిర్మాత. నవంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘పొలిమేర’ మొదటి భాగంలో కొన్ని బెడ్రూమ్ సన్నివేశాలు, బూతులు కూడా ఉంటాయి. అది ఓటీటీ సినిమా కాబట్టి.. ఇబ్బంది లేదు. కానీ (Maa Oori Polimera 2) ‘పొలిమేర 2 ‘ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
మరి ఇందులో కూడా అలాంటి కంటెంట్ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీని పై దర్శకుడు అనిల్ ని ప్రశ్నించగా.. ”పొలిమేర 2 ‘ కి యు/ఎ అడిగాం. కానీ దానికి వాళ్ళు చాలా కట్స్ చెప్పారు. దీంతో మాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేయండి అని చెప్పాము. అయినా సరే వాళ్ళు కొన్ని సన్నివేశాలు కట్ చేయాలని చెప్పారు. దీంతో చాలా డిస్కషన్లు అయ్యాయి. ఫైనల్ గా కట్స్ లేకుండా ‘ఎ’ సర్టిఫికెట్ తెచ్చుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!