2018లో వచ్చిన ‘వీరభోగ వసంతరాయలు’ తర్వాత నారా రోహిత్ (Nara Rohith) ఇంకో సినిమాలో నటించలేదు. మధ్యలో పలానా సినిమాలో ఇతను నటిస్తున్నాడు అంటూ ఏవేవో వార్తలు వచ్చాయి. మరోపక్క ఇతను సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు అనే ప్రచారం కూడా జరిగింది. అన్నీ ఎలా ఉన్నా.. ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే నారా రోహిత్ సినిమాలు చేసాడని, దర్శకనిర్మాతలు కేవలం చంద్రబాబు నాయుడు మెప్పు కోసమే నారా రోహిత్ తో సినిమాలు చేసారని..
వైసీపీ ప్రభుత్వం వచ్చాక నారా రోహిత్ తో ఎవ్వరూ సినిమాలు చేయలేదని’ విమర్శించారు. అయితే నారా రోహిత్ ఆ రూమర్స్ కి చెక్ పెట్టడానికి ‘ప్రతినిథి2’ (Prathinidhi 2) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఏప్రిల్ 25 నే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మే 3 కి పోస్ట్ పోన్ అయ్యింది. తర్వాత మే 3 న కూడా సెన్సార్ కాకపోవడం వల్ల మే 10 కి మార్చారు. మొత్తానికి ఇప్పుడు సెన్సార్ అయ్యింది.
కానీ సెన్సార్ చేసినట్టు సర్టిఫికెట్ ఇవ్వలేదట సెన్సార్ యూనిట్. దీని వల్ల టీం ప్రమోషన్ మొదలుపెట్టలేదు. దర్శకుడు మూర్తి (Murthy Devagupthapu) , హీరో నారా రోహిత్ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు అయితే ఇచ్చారు కానీ.. ఎటువంటి ప్రెస్ మీట్లు వంటివి నిర్వహించలేదు. దీని వల్ల సినిమా రిలీజ్ టైంకి కావాల్సిన మైలేజ్ వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. అసలు ‘ప్రతినిథి 2 ‘ కి మాత్రమే ఎందుకు ఇలాంటి సమస్య వచ్చి పడింది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.