సదా అందాల ఆరబోతకు సెన్సార్ కత్తెర!

  • July 10, 2018 / 12:56 PM IST

ఎప్పుడో 11 ఏళ్ల క్రితం “టక్కరి” సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కనిపించిన సదా ఆ తర్వాత చిన్న చిన్న చిత్రాల్లో స్పెషల్ రోల్స్, ఐటెమ్ సాంగ్స్ చేస్తూ కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ “ఢీ జోడీ” అనే డ్యాన్స్ షోకు జడ్జ్ గా దర్శనమిచ్చింది. ఆ షోతో కాస్త క్రేజ్ సంపాదించుకొన్న సదా మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తుందేమో అనుకొన్నారందరూ. కానీ.. పాపం మన తెలుగు దర్శకనిర్మాతలు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో కష్టపడి తమిళంలో ఒక సినిమా అవకాశం దక్కించుకొంది.

తమిళంలో తెరకెక్కుతున్న “టార్చ్ లైట్” అనే సినిమాలో వేశ్య పాత్ర పోషిస్తోంది. వేశ్యా జీవితాల నేపధ్యంలో సాగే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్ళగా సినిమాలో న్యూడిటీ, వయొలెన్స్ ఎక్కువ ఉండడంతో సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు సెన్సార్ సభ్యులు. దాంతో ఇప్పుడు “టార్చ్ లైట్” టీం మెంబర్స్ ఢిల్లీ ట్రిబ్యూనల్ వద్దకు వెళ్లారు. ఈ సమాచారం మేరకు సదా సినిమాలో బాగా శృతి మించిందని అర్ధమవుతోంది. మరి సినిమా విడుదలైతే తప్ప ఆమె అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉందనేది తెలియదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus