టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న కొరటాల శివ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మరికొన్ని నెలల్లో రిలీజ్ కానుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే కొరటాల శివ శ్రీమంతుడు సినిమాకు సంబంధించి క్రిమినల్ కేసును ఫేస్ చేయాల్సిందేనని కోర్టు తాజాగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రైటర్ విల్సన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ఇతని కలం పేరు శరత్ చంద్ర కావడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ 2012లో నేను చచ్చేంత ప్రేమ పేరుతో నవల రాశానని అది స్వాతి మంత్లీలో ప్రచురితమైందని పేర్కొన్నారు. సముద్ర గారిని కలిసి ఈ నవలతో సినిమా తీయాలని భావించానని ఆయన చెప్పుకొచ్చారు. నారా రోహిత్ తో ఈ సినిమా తీయాలని ఫీలయ్యామని విల్సన్ పేర్కొన్నారు. శ్రీమంతుడు కాపీ అని ఫీలయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. కొరటాల శివ నవల చదవలేదని చెప్పారని విల్సన్ చెప్పుకొచ్చారు.
కంటెంట్ వేరు అని కొరటాల చెప్పారని ఆయన పేర్కొన్నారు. 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇస్తామని రైటర్స్ అసోసియేషన్ లో చెప్పారని విల్సన్ కామెంట్లు చేశారు. ఆ తర్వాత దాసరి గారిని కలిశానని ఆయన తెలిపారు. ఏడేళ్లు కోర్టులో ఫైట్ చేశానని విల్సన్ వెల్లడించారు. చల్లా అజయ్ కుమార్ మా తరపు నుంచి వాదనలు వినిపించారని విల్సన్ అన్నారు.
నేను దేవరకొండ అని పేరు పెడితే సినిమాలో దేవరకోట అని సినిమాలో పెట్టారని విల్సన్ వెల్లడించారు. నేను వెలిగొండ ప్రాజెక్ట్ బ్యాక్ డ్రాప్ లో నవల రాశానని ఆయన అన్నారు. మక్కీకి మక్కీ కాపీ జరిగిందని ఆయన వెల్లడించారు. విల్సన్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్లపై కొరటాల శివ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.