నాగశౌర్య ‘ఛలో’ పక్కా హిట్

ఒక్కోసారి ట్రైలర్లు చూస్తే సినిమా తప్పకుండా హిట్ అనిపిస్తుంది. అలాగే ట్రైలర్ చూసి సినిమాకెళ్ళి బుక్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయనుకోండి. అయితే.. “ఛలో” ట్రైలర్ చూస్తుంటే మాత్రం ష్యూర్ షాట్ హిట్ అనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి మంచి స్పందన లభించడంతో ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెండింతలు చేసింది. త్రివిక్రమ్ అసిస్టెంట్ వెంకీ దర్శకత్వంలో నాగశౌర్య, కన్నడ బ్యూటీ రష్మిక మండనా జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలవ్వానుండగా.. ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు.
కాన్సెప్ట్, కామెడీ, లవ్, యాక్షన్, సస్పెన్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉండడంతో.. “ఛలో” ట్రైలర్ జనాల్ని బాగా ఆకట్టుకొంది.

డైరెక్టర్ వెంకీ ఇదివరకూ త్రివిక్రమ్ కి అసిస్టెంట్ గా వర్క్ చేసి ఉండడంతో.. టేకింగ్ పరంగా త్రివిక్రమ్ ఛాయలు కనబడుతున్నాయి. నాగశౌర్య ఎనర్జీటిక్ పెర్ఫార్మెన్స్, రష్మిక మండన్నా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, హర్ష కామెడీ ట్రైలర్ లో ప్రధానాకర్షణలుగా నిలిచాయి. తెలుగు-తమిళ రాష్ట్రాల బోర్డర్స్ మధ్య లవ్ స్టోరీ నేపధ్యంలో తెరకెక్కుతున్న “ఛలో” ఒక క్యూట్ లవ్ స్టోరీ కాగా.. సినిమాలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ సరికొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. అందుకే కథ మీద విపరీతమైన నమ్మకంతో నాగశౌర్య ఈ చిత్రాన్ని స్వంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. చూస్తుంటే.. గత రెండేళ్లుగా మంచి హిట్ లేక ఢీలాపడ్డ నాగశౌర్య “ఛలో”తో సూపర్ హిట్ అందుకొనేలా ఉన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus