Champion: మిక్కీ.. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

ఈ రోజుల్లో సినిమా పాటలంటే కేవలం ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కోసమే పుడుతున్నట్లు ఉన్నాయి. రెండు నిమిషాల్లో పాట అయిపోవాలి, వెంటనే హుక్ స్టెప్ వైరల్ అవ్వాలి. ఇదే ఇప్పుడు నడుస్తున్న మ్యూజిక్ ట్రెండ్. కానీ మెలోడీ బ్రహ్మ మిక్కీ జే మేయర్ మాత్రం ఈ ఫార్ములాను బ్రేక్ చేశారు. రోషన్ మేకా హీరోగా వస్తున్న ‘ఛాంపియన్’ సినిమాతో ఆయన చేసిన ప్రయోగం ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ ను ఆశ్చర్యపరుస్తోంది.

Champion

డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం మిక్కీ అందించిన సంగీతమే అని చెప్పాలి. ముఖ్యంగా ‘గిర గిర గింగిరాగిరే’ పాట వింటుంటే వింటేజ్ మిక్కీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ పాట ఒక రేంజ్ లో మార్మోగుతోంది. కేవలం బీట్ సాంగ్స్ మాత్రమే కాదు, మనసును తాకే మెలోడీ ఉంటే జనం ఎప్పుడూ ఆదరిస్తారని ఈ పాట మరోసారి నిరూపించింది.

అయితే ఈ ఆల్బమ్ లో అందరినీ ఆకర్షిస్తున్న అసలు విషయం పాటల డ్యూరేషన్. సాధారణంగా ఇప్పుడు పాటలన్నీ మూడు నిమిషాల లోపే ఉంటున్నాయి. కానీ ఛాంపియన్ లోని పాటలు దాదాపు ఐదు నిమిషాల పాటు సాగుతాయి. ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ తక్కువ ఉన్న ఈ జనరేషన్ లో, ఇంత పెద్ద పాటలు చేయడం నిజంగా పెద్ద రిస్క్. కానీ కంటెంట్ బాగుంటే నిడివి అడ్డురాదని మిక్కీ ప్రూవ్ చేశారు.

రీసెంట్ గా మిక్కీ కెరీర్ గ్రాఫ్ చూస్తే కాస్త ఒడిదుడుకులు ఉన్నాయి. ‘మిస్టర్ బచ్చన్’, ‘హిట్టు 3’ ఆశించిన ఫలితాలివ్వకపోయినా, ఈ ఆల్బమ్ కు వస్తున్న రెస్పాన్స్ తో ఆయన మళ్ళీ రేసులోకి వచ్చారు. ఈ సినిమా క్లిక్ అయితే, ఆయన తర్వాతి ప్రాజెక్ట్ ‘అనగనగా ఒక రాజు’ పై అంచనాలు పెరుగుతాయి. ట్రెండ్ ను ఫాలో అవ్వడం కాదు, సెట్ చేయడమే అసలైన క్రియేటివిటీ అని మిక్కీ ఈ ఆల్బమ్ తో నిరూపించారు. ఇక గతంలో మాదిరిగా మిక్కీ వరుస హిట్స్ అందుకుని ఆ మ్యూజికల్ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus