నా కలర్ గురించి కామెంట్ చేశారు : చాందిని చౌదరి

షార్ట్ ఫిలిమ్స్ పాపులర్ అయిన నటి చాందిని చౌదరి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘కేటుగాడు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తరువాత కొన్ని చిత్రాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయింది. తాజాగా ఈ బ్యూటీ సుహాస్ తో కలిసి ‘కలర్ ఫోటో’ అనే సినిమాలో నటించింది. ఈ నెల 23న ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది చాందిని. ‘కలర్ ఫోటో’ కథలో పాత్ర తనకు బాగా నచ్చడంతో ఓకే చెప్పేశానని.. సుహాస్ కొత్త హీరో అని ఆలోచించలేదని వెల్లడించింది. 1990 కాలం నేపథ్యంలో సాగే ఈ సినిమా వర్ణవివక్ష ప్రధానాంశంగా తెరకెక్కింది. అప్పటి ఆహార్యంతో స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి పాత్రలో చాందిని కనిపించనుంది. సమాజంలో ఇప్పటికీ వర్ణవివక్ష ఉందని.. హీరోయిన్ గా మారిన తరువాత ‘నువ్వేమైనా పెద్ద కలర్ ఉన్నానని నుకుంటున్నావా..?’ అని ఓ వ్యక్తి చాందినిని హేళన చేశారట.

అంతకుమించి తనకు ఇండస్ట్రీలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని తెలిపింది. రంగుని బట్టి ఎదుటివారి వ్యక్తిత్వాన్ని, స్థాయిని అంచనా వేయడం కరెక్ట్ కాదని తన అభిప్రాయాన్ని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాలలో నటిస్తోంది. సుధీర్ వర్మ నిర్మాణంలో ఓ సినిమా, అలానే ఓ లవ్ స్టోరీలో, విశ్వక్ సేన్ కి జంటగా ‘ప్రాజెక్ట్ గామి’ అనే మరో సినిమాలో నటిస్తోంది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus