లక్కీ ఛార్మ్, గోల్డెన్ లెగ్… ఈ మాట మనం ఎక్కువగా హీరోయిన్ల గురించి అంటుంటాం. అంటే ఆ హీరోయిన్‌తో సినిమా అంటే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ పక్కా అని. అయితే ఇలాంటి పేరు ఓ హీరోకు కూడా ఉందని తెలుసా? ఇప్పుడు అలాంటి హీరోలు లేరు అని చెప్పొచ్చు. అలాంటి హీరో ఈ రోజు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయనే చంద్రమోహన్. మూడు తరాల వారధి అయిన చంద్రమోహన్… హీరోగా కెరీర్ మొదలెట్టి, కమెడియన్‌గా మారి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు అయ్యారు.
చంద్రమోహన్ పక్కన నటించిన హీరోయిన్లు ఆ తరవాత కాలంలో టాప్ పొజీషన్‌కి చేరుకున్నారు అని చెప్పొచ్చు. అందుకే ఆయన్ను లక్కీ హీరో అంటారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద… ఇలా చాలా మంది హీరోయిన్లకు ఆయన తొలి సినిమా హీరో. అంతేకాదు ఆ సినిమా తర్వాత ఆ కథానాయికలు స్టార్ హీరోయిన్లు అయిపోయారు కూడా. అంతెందుకు ఆ పాయింట్ ఆయన దగ్గర ప్రస్తావిస్తే… ‘నాతో యాక్ట్ చేసిన హీరోయిన్లు టాప్ స్టార్లయిపోతే.. నేనిక్కడే ఉండిపోయాను’ అని చంద్రమోహన్ అనేవారు కూడా.
చంద్రమోహన్ సరసన సుమారు 60 మంది హీరోయిన్లు నటించారు. ఒకటి రెండు సినిమాలు చేసి సక్సెస్ కాని హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలో బిజీ కావడానికి చంద్ర మోహన్ సరసన యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారని నాటి సినిమా జనాలు అనేవారు. బాలనటిగా సినిమాలు చేసిన శ్రీదేవి ‘పదహారేళ్ళ వయసు’ సినిమాతో కథానాయికగా మారిందనే విషయం తెలిసిందే. జయప్రద తొలి సినిమా ‘సిరిసిరి మువ్వ’లో ఆయనే హీరో. జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ… ఇలా ఎంతోమందికి ఆయనే తొలి హీరో.
ఇక చంద్రమోహన్ (Chandra Mohan) సరసన ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ జయసుధ. ఇద్దరూ 34 చిత్రాల్లో జంటగా నటించారు. ఆ తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా లక్ష్మి, వాణిశ్రీ, రాధిక, మాధవి, జయప్రద, విజయశాంతి లాంటి కథానాయికలతో పదికిపైగా సినిమాల్లో నటించాడు చంద్రమోహన్. అయితే ‘పదహారేళ్ళ వయసు’ సినిమాతో తర్వాత శ్రీదేవితో కలసి నటించకపోవడం గమనార్హం.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!