Pushpa Movie: పుష్ప మూవీలో మాజీ సీఎంను గమనించారా?

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ గత రెండు రోజుల నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని సమాచారం అందుతోంది. సుకుమార్ ఈ సినిమాను 1996 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం మధ్య జరిగే కథగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు ఉన్నాడంటూ ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే పుష్ప కథ జరిగినట్టు చూపించడంతో పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు నాయుడు ఫోటో ఉండేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు అభిమానులు డైరెక్టర్ సుకుమార్ క్రియేటివిటీని తెగ మెచ్చుకుంటూ ఉండటం గమనార్హం. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప సినిమాలో ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు ఆ విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో పుష్ప ది రైజ్ హిట్ గా నిలిచింది.

క్లైమాక్స్ లో ఏదైనా షాకింగ్ ట్విస్ట్ ఉండి ఉంటే బాగుండేదని ఈ సినిమా చూసిన కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమాతో సుకుమార్ కష్టానికి తగిన ఫలితం దక్కుతోంది. పుష్ప ది రైజ్ బాలీవుడ్ లో సక్సెస్ సాధించడంతో పుష్ప ది రూల్ కోసం నార్త్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమాతో బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం సరైన నిర్ణయమేనని బన్నీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సుకుమార్ రంగస్థలం సినిమా నుంచి రూటు మార్చి మాస్, క్లాస్ ప్రేక్షకులు ఇష్టపడే సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తుండటం గమనార్హం. పుష్ప ది రైజ్ 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కినా నిర్మాతలకు మాత్రం ఈ సినిమా లాభాలను అందించింది. ఏపీలో ఈ సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్లకు నిర్మాతలు తమ వంతు సహాయం చేశారని తెలుస్తోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus