టాలీవుడ్‌లో ఓ ఇమేజ్ అందుకుంటే దాన్ని అలానే కొనసాగించడం చాలా కష్టం. అయితే నేటి తరం కుర్ర హీరోలు ఇలాంటి ఇమేజ్‌లను కావాలనే తెచ్చుకుని దాన్ని కొనసాగిస్తూ దానినే తమ మారుపేరుగా బ్రాండింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంత ట్రోలింగ్ వచ్చినా.. దానిని ప్రచారం కోసం వాడేస్తున్నారు. అలాంటి వారిలో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఒకడు. సీనియర్ టీవీ యాక్టర్ ప్రభాకర్ తనయుడిగా సినిమాల్లోకి వచ్చినా.. యాటిట్యూడ్ స్టార్‌గానే ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు అదే యాటిట్యూడ్‌తో రీసెంట్ బిగ్గెస్ట్ సినిమా గురించి కామెంట్లు చేశాడు.
మొన్నామధ్య ‘రామ్ నగర్ బన్నీ’ అంటూ ఓ సినిమా చేసి ఆర్థికంగా, ట్రోలింగ్ పరంగా దారుణంగా దెబ్బ తిన్న చంద్రహాస్.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘కాయిన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీమ్ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టింది. ఈ కార్యక్రమంలో చంద్రయాన్ మాట్లాడుతూ తన యాటిట్యూడ్ స్టార్ ట్యాగ్ గురించి కొన్ని కామెంట్లు చేశాడు. అక్కడితో ఆగకుండా.. లిటిల్ హార్ట్స్ సినిమా గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో కామెంట్ చేశాడు.
నేను తీసేయల్లన్నా ‘యాటిట్యూడ్ స్టార్’ ట్యాగ్ పోదు. అయినా అది నాకు ప్లస్సే అయ్యింది అని క్లారిటీ ఇచ్చేశాడు చంద్రహాస్. ఆ తర్వాత ఎవరో రిపోర్టర్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమా గురించి మాట్లాడితే.. ఆ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని మెచ్చుకున్నారు. అక్కడితో ఆగకుండా ఆ సినిమా నాకు తెలిసి అంత గొప్ప సినిమా కాదు అని కామెంట్ చేశాడు. అయితే తాను మాత్రం ఎంజాయ్ చేశానని చెప్పాడు. దీంతో ఎప్పటిలాగే చంద్రహాస్ చేసిన ఈ కామెంట్స్ నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒక యూట్యూబర్ చేసిన ఓ చిన్న సినిమా పెద్ద హిట్ అయింది. దీని కోసం పెద్ద పెద్ద స్టార్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ సినిమా గురించి అలా తక్కువ చేసి మాట్లాడటం సరికాదు అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరైతే ఆయన యాటిట్యూడ్ స్టార్.. అలానే మాట్లాడతాడు అని అంటున్నారు.