‘మ్యాడ్’ సినిమాతో యూత్‌ఫుల్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు కల్యాణ్ శంకర్. అదే ఫ్లోలో ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా చేసి అలరించే ప్రయత్నం చేసినా తొలి భాగమంత సందడి, సంబరం తేలేకపోయారు. కానీ దర్శకుడిగా అందులో వినోదం పండించే దర్శకుడిగా మంచి పేరే తెచ్చుకున్నారు. ఇప్పుడు మూడో సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈసారి కూడా కామెడీని ఏ మాత్రం వదలడం లేదు. అయితే ఈసారి వినోదం పండించేది దెయ్యం. అవును మీరు చదివింది నిజమే ఆయన ఈసారి ‘ఘోస్ట్’ని రైడ్ చేయబోతున్నారు.
నిజానికి ‘మ్యాడ్ స్క్వేర్’ తర్వాత కల్యాణ్ శంకర్ తన సినిమాను మాస్ మహారాజ్ రవితేజతో చేయాలి. ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్ అనుకుంటుండగా ఒక్కసారిగా సౌండ్ ఆగిపోయింది. ఇప్పుడు కొత్తరకం సౌండ్ బయటకు వస్తోంది. అదే కల్యాణ్ శంకర్ కొత్త సినిమా బాయ్స్ హాస్ట్ చుట్టూ తిరుగుతోందట. సితార నాగవంశీనే ఈ సినిమాను నిర్మిస్తున్నారట. బోయ్స్ హాస్టల్‌లో ఓ దెయ్యం దూరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో కొత్త సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట కల్యాణ్ శంకర్.
హారర్, కామెడీ బలంగా మిక్స్ చేసి ఇప్పటికే ఆయన కథను సిద్ధం చేసుకున్నారట. ఈ సినిమాలో దాదాపు కొత్త నటులే కనిపిస్తారని తెలుస్తోంది. ఇక సితార ఎంటర్‌టైన్మెంట్స్ తరహాలో కొన్ని సర్‌ప్రైజ్ ఎంట్రీలూ ఉంటాయట. ప్రస్తుతం కథ తుది దశకు వచ్చిందని.. అంతా ఓకే అనుకుంటే కాస్టింగ్ కాల్ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. అంతా ఓకే కానీ రవితేజతో చేయాల్సిన సినిమా బడ్జెట్ ఎందుకు ఆగింది అనుకుంటున్నారా? ఏం లేదండీ ఆ సినిమాకు అవసరమైన భారీ బడ్జెట్ను ఇప్పుడు పెట్టే ఆలోచనలో నిర్మాతలు లేరట. అందుకే కల్యాణ్ శంకర్ ఈ ఆలోచన చేస్తున్నారని సమాచారం.
కాలేజీ హాస్టల్‌లో కల్యాణ్ శంకర్ రాసుకునే సీన్స్‌లో ఎలా ఉంటాయో ‘మ్యాడ్’ సినిమాలో మనం ఇప్పటికే చేశాం. ఇప్పుడు వాటకి హారర్ ఫ్లేవర్ యాడ్ అయితే రచ్చ రచ్చ తప్పదు. చూద్దాం మరి ఆయన ఏం రాస్తారో, ఎలా తీస్తారో?