లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చంద్రముఖి2 సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ రాలేదు. స్కంద, పెదకాపు1 సినిమాలకు పోటీగా విడుదల కావడం ఈ సినిమాకు మైనస్ అయింది. 10 కోట్ల రూపాయల టార్గెట్ తో తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన ఈ సినిమా ఫుల్ రన్ లో ఈ టార్గెట్ లో 50 శాతం కలెక్షన్లను సాధించడం కూడా కష్టమేనని తెలుస్తోంది.
అయితే చంద్రముఖి2 (Chandramukhi2) తమిళ్ వెర్షన్ మాత్రం మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాకు తమిళంలో 30 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. కథ, కథనం కొత్తగా లేకపోవడం ఈ సినిమా ఫ్లాప్ కు కారణమని చాలామంది భావిస్తారు. చంద్రముఖి2 తమిళ్ వెర్షన్ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
మరోవైపు లారెన్స్ కథల ఎంపికలో జాగ్రత్త పడాల్సి ఉంది. లారెన్స్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా కథల ఎంపికలో పొరపాట్లు చేస్తే లారెన్స్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. లారెన్స్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. చంద్రముఖి2 తరహా కథలు లారెన్స్ కు సూట్ కావని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దర్శకుడు పి.వాసు ఒకే కథను ఎన్నిసార్లు తిప్పితిప్పి తీస్తాడని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పి. వాసు ఈ తరహా కథలకు దూరంగా ఉండాలని మరి కొందరు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. పి.వాసు తర్వాత ప్రాజెక్ట్ ల విషయంలో అయినా జాగ్రత్త వహిస్తారేమో చూడాల్సి ఉంది. చంద్రముఖి2 ఇతర భాషల్లో మాత్రం భారీ నష్టాలను మిగల్చడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లారెన్స్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.