Andhra King Taluka: రామ్ కొత్త చిత్రం “ఆంధ్ర కింగ్” ఒక రోజు ముందు గానే రిలీజ్ కానుందా??

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ” ఆంధ్ర కింగ్ తాలూకా ” . ఈ సినిమా పి.మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. చాలా రోజుల తరువాత విలక్షణ నటుడు ఉపేంద్ర తెలుగు లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. శుక్రవారం (నిన్న) ఈ మూవీ నుంచి “చిన్ని గుండెలో” అంటూ సాగే ఒక మెలోడీ సాంగ్ ను విడుదల చేశారు.

Andhra King Taluka

ఈ సినిమాకు వివేక్ – మెర్విన్ మ్యూజిక్ అందిస్తుండగా ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యమందించారు. ఈ పాటను మెర్విన్ సోలమన్, సత్య యామిని పాడటం జరిగింది. ఈ పాటలో రామ్ భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ చాలా బాగా కుదిరినట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ చిత్రం ఫ్రెష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్ లో నిర్మాణం పనులు పూర్తి చేసుకుంటుంది.

అసలు అయితే ఈ చిత్రం ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఒక రోజు ముందు గానే ఈ నెల 27న ఈ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అతి త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు నిర్మాతలు. మరి ఈ మూవీ ద్వారా రామ్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి..

శిష్యుడి వివాహానికి సందీప్ రెడ్డి వంగా..

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus