‘సైరా నరసింహారెడ్డి ’లో ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న తారలు వీరే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి`. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. కొత్త పుంతలు తొక్కుతున్న తెలుగు సినిమాలకు అనుగుణంగా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. బ్రిటీష్ పాలనకు ఎదురొడ్డి నిలిచిన తొలి స్వాతంత్ర్య యోధుడు .. చరిత్ర మరుగున పడిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పెరుగుతున్న తెలుగు సినిమా స్పాన్‌కు అనుగుణంగా పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను అక్టోబర్ లో ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అలాగే సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్, కిచ్చాసుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, నిహారిక, జగపతిబాబు, రవికిషన్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను కూడా విడుదల చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ నిర్మితమవుతోన్న `సైరా నరసింహారెడ్డి` సినిమా గురించి మెగాభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అందరి అంచనాలను మించేలా ఉంటుందని తెలుస్తుంది.

‘సైరా నరసింహారెడ్డి ’లో ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న తారలు వీరే!

1 – తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి

2 – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు అయిన గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ బచ్చన్

3 – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య సిద్దమ్మగా నయనతార

4 – రాజా పండి పాత్రలో విజయ్ సేతుపతి

5 – అవుకు రాజు పాత్రలో కన్నడ హీరో సుదీప్

6 – రాజ నర్తకి పాత్రలో నటించిన తమన్నా

7 – వీరా రెడ్డి పాత్రలో జగపతి బాబు

8 – ‘సైరా నరసింహారెడ్డి’లో ముఖ్యపాత్రలో నటిస్తోన్న రవికిషన్ శుక్లా

9 – యుద్ధ యోధురాలుగా నిహారిక

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus