రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి అవార్డులు పంట పండుతోంది. తాజాగా అమెరికాలో 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం సత్తా చాటింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. వరల్డ్ వైడ్ అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పలు విభాగాల్లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా అవార్డుల విషయంలోనూ రాణించింది. ఇటీవల బెస్ట్ ఒరిజినల్.. నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే.
ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ చిత్రం గురించి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. దాంతోపాటు దేశ వ్యాప్తంగా పలు భాషాల్లో విడుదలైన ఈ చిత్రం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. అవార్డుల సందర్భంగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోలుగా నటించిన రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హీరోలు చాటిన స్ఫూర్తి ఆదర్శంగా నిలుస్తోంది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో భాగంగా అర్జెంటినా 1985.. చిత్రానికిగాను నాన్ ఇంగ్లిష్ బెస్ట్ పిక్చర్ క్యాటగిరీలో అవార్డు లభించింది. ఆ సినిమాకు అవార్డును ప్రకటించగానే హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నిల్చొని చప్పట్లు కొట్టారు. షోలో పాల్గొన్న వారిలో ఇలా స్టాండింగ్ ఒవెషన్ ఇచ్చింది వీరిద్దరే కావడం విశేషం. ప్రత్యర్థి చిత్రానికి అవార్డు వచ్చినా నో ఇగో.. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం కూడా ఇందుకు నామినేట్ అయిన నేపథ్యంలో తమ పోటీ చిత్రానికి అవార్డు దక్కినా మన హీరోలు చూపించిన స్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ యూనిట్ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో అవార్డు అందుకున్న అర్జెంటినా 1985 సినిమాకు శుభాకాంక్షలు తెలిపారు. మీ దేశం మిమ్మల్ని గర్విస్తుంది అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర యూనిట్‌పై అభినందనలతో ముంచెత్తుతున్నారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?