దసరా రోజునే మనసు ముక్కలైపోయింది.. ఛార్మీ ఎమోషనల్ పోస్ట్…!

ఇప్పుడు వరుసగా సినీ సెలబ్రిటీలు కరోనా భారినపడుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. తమన్నా, రాజశేఖర్,రష్మీ, సుధీర్ వంటి వారు కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఛార్మీ తల్లిదండ్రులకు కూడా కరోనా సోకిందట. ఈ విషయాన్ని స్వయంగా ఛార్మీనే తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ.. అక్టోబర్ 22న తన తల్లిదండ్రులకు దురదృష్టవశాత్తు కరోనా సోకిందని అని…. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ వారు ఇంట్లోనే ఉన్నారని అయితే ఇటీవల వచ్చిన వరదల కారణంగానే ఇది సంభవించి ఉంటుందని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.

ఈ విషయం పై ఛార్మీ స్పందిస్తూ…”ఈ వార్త వినగానే నా మనసు ముక్కలైపోయింది. ప్రస్తుతం మా పేరెంట్స్ ను ఏ ఐ జి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం ఇప్పిస్తున్నాం. దీనిని బట్టి అందరికీ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే…ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయని డౌట్ వస్తే కేర్ లెస్ గా ఉండకండి.వెంటనే టెస్టులు చేయించుకోండి…ఒకవేళ పాజిటివ్ అని తేలితే ఫస్ట్ స్టేజిలోనే దానిని అంతం చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నా పేరెంట్స్ ను చూడడానికి…

ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఆ దుర్గా మాత ఆశీర్వాదంతో పాటు మీరు కూడా నా పేరెంట్స్ కోసం ప్రార్ధించాలని కావాలని ప్రతీ ఒక్కరినీ కోరుకుంటున్నాను” అంటూ పేర్కొంది.

1

2

3

4

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus