Chatrapathi Collections: ఫుల్ రన్లో హిందీ ‘ఛత్రపతి’ ఎంత కలెక్ట్ చేసిందంటే?

టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా పాన్ ఇండియా చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసి భారీ లాభాలు పొందిన ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. బెల్లంకొండ శ్రీనివాస్ ను తెలుగులో హీరోగా లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ .. హిందీలో కూడా శ్రీనివాస్ ను హీరోగా లాంచ్ చేయడం విశేషం.

టీజర్, ట్రైలర్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది. మే 12న ఈ మూవీ హిందీలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కానీ ప్రేక్షకుల నుండి ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం హిందీ వెర్షన్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ తో పోల్చి వినాయక్ తీసిన ఈ హిందీ ‘ఛత్రపతి’ ని ఘోరంగా విమర్శించారు క్రిటిక్స్.

అయినప్పటికీ నార్త్ లో మాస్ సెంటర్స్ లో (Chatrapathi) ‘ఛత్రపతి’ కి మంచి టాక్ వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు చూసిన కొందరు మాస్ ఆడియన్స్ ‘ఛత్రపతి’ కి పాజిటివ్ టాక్ చెప్పారు.యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయని చెప్పారు. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ పూర్తిగా చేతులెత్తేసింది.

ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ అక్కడ కేవలం రూ.1.1 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. ‘ది కేరళ స్టోరీ’ వంటి క్రేజీ మూవీ పోటీగా ఉండడంతో హిందీ ‘ఛత్రపతి’ కి కలిసిరాలేదని స్పష్టమవుతుంది. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాతలు సేఫ్ అయిపోయారని ఇన్సైడ్ టాక్.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus