బిగ్‌బాస్ ఫేమ్ కత్తి కార్తీకపై కేసు నమోదు!

యాంకర్ కత్తి కార్తీకపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. కార్తీక తనను మోసం చేసిందంటూ దొరస్వామి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. దొరస్వామి అనే వ్యక్తి టచ్ స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్ అనే సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా భారీ అపార్ట్మెంట్ ను నిర్మించాలని అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కత్తి కార్తీక.. మరో వ్యక్తి సహాయంతో దొరస్వామిని కలిసింది. అమీన్ పూర్ వద్ద ఎకరాల స్థలం ఉందని.. అందులో తనకు కూడా వాటా ఉందని నమ్మించింది.

ఈ క్రమంలో మరో ఐదుగురు వాటాదారులను కూడా పరిచయం చేసింది. డెవలప్మెంట్ కోసం స్థలాన్ని రూ.35 కోట్లకు ఇప్పిస్తామని చెప్పి సెక్యూరిటీ డిపాజిట్ గా కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని కోరారు. కార్తీక మాటలు నమ్మిన దొరస్వామి.. ఆమె చెప్పిన అకౌంట్స్ కి కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే అంతలోనే ఆ స్థలానికి, కత్తి కార్తీకకు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది.

దీంతో కార్తీక తనను మోసం చేసిందంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై, ఆమె స్నేహితులపై ఫిర్యాదు చేశాడు. కత్తి కార్తీక బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొంది. 70 రోజులు పాటు సాగిన ఈ షోలో 43వ ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది కార్తీక. కొద్దిరోజుల క్రితం దుబ్బాక ఉప ఎన్నికల సంగ్రామంలో పాల్గొనడానికి తాను సిద్ధమంటూ ప్రకటించి సంచలనం సృష్టించింది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus