Surekha Vani: ఆడియెన్స్ కు వార్నింగ్ ఇచ్చిన సురేఖ వాణి.. కారణం అదే..!

సురేఖ వాణి.. క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై ఓ చిన్న షో తో కెరీర్ ను మొదలుపెట్టి సహాయ నటిగా ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందమైన ఫోటోలను షేర్ చేస్తుండడం మాత్రమే కాకుండా తన కూతురు సుప్రీత తో కలిసి డ్యాన్స్ వీడియోలు వంటివి చేస్తూ యమ బిజీగా గడుపుతూ ఉంటుంది.

సుప్రీత కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ మధ్యనే ఓ ప్రైవేట్ విడియో సాంగ్ లో నటించింది. ఈ తల్లి కూతుర్ల క్రేజ్ ను వాడుకోవాలని ఓ అజ్ఞాత వ్యక్తి డిసైడ్ అయ్యాడు. సురేఖ వాణి సన్నిహితుడిగా చెప్పుకుంటూ ఆమె పేరు పై సోషల్ మీడియాలో పేజెస్ క్రియేట్ చేసి, వాట్సప్ లో కూడా కొంత మందికి మెసేజ్ లు పంపుతున్నాడు. వాళ్ళ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా అడిగి తీసుకుంటున్నాడు అని తెలుస్తుంది.

ఈ విషయం కాస్త సురేఖ వాణి వద్దకు వెళ్ళింది. వెంటనే ఆమె అలెర్ట అయ్యి అలాంటి వాటిని నమ్మి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్,బ్యాంక్ డీటైల్స్ వంటివి ఎవ్వరికీ ఇవ్వొద్దు. డబ్బులు ఎవ్వరికీ ట్రాన్స్ఫర్ చేయొద్దు అంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగానే నడుస్తున్నాయి. గతంలో సునీత తో పాటు చాలా మంది నటీనటుల పేర్లతో మోసాలకు పాల్పడ్డారు కొందరు అజ్ఞాత వ్యక్తులు. సామాన్యుల వద్ద నుండీ గట్టిగా డబ్బుని గుంజారు కూడా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus