బాలయ్యను అనవసరంగా తిట్టుకోంటుంటాం కానీ.. ఆయనకంటే మంచోడు, భోళా మనిషి ఇండస్ట్రీలో మరొకడు లేడు అంటే అతిశయోక్తి కాదేమో. ఆయనకి సరిగ్గా సింక్ అవ్వాలే కానీ అవసరమంటూ ఆయన వద్దకి వెళ్ళిన ఎవ్వరూ వట్టి చేతులతో వెనక్కి వచ్చిన సందర్భమే లేదు. అటువంటి బాలకృష్ణ ఒక్కోసారి అభిమానుల్ని కొట్టడం వల్ల, ఇంకోసారి మీడియా ముందు స్పష్టంగా మాట్లాడలేకపోవడం వల్ల చీప్ గా చూస్తుంటారు కొందరు. కానీ.. నిజానికి బాలయ్య చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. దానికి నిదర్శనం ఆయన తాజాగా ఒప్పుకొన్న సినిమా.
“జై సింహా”తో తనకు ఈ ఏడాది మొదటి సూపర్ హిట్ ఇచ్చిన నిర్మాత సి.కళ్యాణ్ అనంతరం నిర్మించిన “ఇంటిలిజెంట్” చిత్రంతో సూపర్ ఫ్లాప్ మూటగట్టుకొని బాలయ్య సినిమాతో వచ్చిన లాభాలన్నీ ధరమ్ తేజ్ సినిమాతో పోగొట్టుకొన్నాడు.
ఈ విషయం బాలయ్యకు తెలిసి తానే స్వయంగా సి.కళ్యాణ్ ని పిలిచి మరీ మరో సినిమా చేస్తానని చెప్పాడట. ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో వినాయక్-బాలయ్యల కాంబినేషన్ లో “చెన్నకేశవరెడ్డి” సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఘన విజయం సాధించకపోయినా బాలయ్య కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సో, ఈ క్రేజీ కాంబినేషన్ లో రానున్న తాజా చిత్రం కోసం బాలయ్య అభిమానులు ఇప్పట్నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.