Chennakesava Reddy: చెన్నకేశవరెడ్డి మూవీ గ్రాస్ కలెక్షన్లు అన్ని రూ.కోట్లా?

వి.వి.వినాయక్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది. బాలయ్య అభిమానులకు ఈ సినిమా నచ్చినా అప్పట్లో కొంతమంది ఇచ్చిన స్టేట్ మెంట్లు ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. స్క్రీన్ ప్లే విషయంలో వినాయక్ తడబడకుండా మరింత జాగ్రత్త పడి ఉంటే బాలయ్య సినీ కెరీర్ లో చెన్నకేశవరెడ్డి కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఉండేది. అయితే కొన్నిరోజుల క్రితం ఈ సినిమా థియేటర్లలో రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

వి.వి.వినాయక్, బెల్లంకొండ సురేష్ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొని ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమాను రీరిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా రీరిలీజ్ లో సాధించిన కలెక్షన్లకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. 5.39 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ మధ్య కాలంలో విడుదలైన ఇతర సినిమాల రీరిలీజ్ కలెక్షన్లను మించి బాలయ్య సినిమా కలెక్షన్లను సొంతం చేసుకుంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ సినిమా కలెక్షన్ల ద్వారా వచ్చిన డబ్బును బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి డొనేట్ చేయనున్నారు.

రాబోయే రోజుల్లో ఆది సినిమాను కూడా భారీస్థాయిలో రీరిలీజ్ చేయాలని బెల్లంకొండ సురేష్ భావిస్తున్నారు. పాత సినిమాలు రీరిలీజ్ లో భారీస్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉండటం గమనార్హం. వచ్చే ఏడాది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సింహా సినిమాలను రీరిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరి ఈ సినిమాల నిర్మాతలు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది. బాలయ్య సినిమాలకు రీరిలీజ్ లో సైతం మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus