మాలికాపురం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓటీటీలో ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ లభించింది. ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులని కూడా మెప్పించింది. ఇందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దేవానంద పాత్ర ని కూడా ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. అంత బాగా నటించింది ఈ పాప. ‘2018 ‘, ‘నైమర్’, ‘అరణ్మనై 4 ‘ వంటి చిత్రాల్లో కూడా ఈ పాప నటించింది.
తాజాగా ఈ పాప తండ్రి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం చర్చనీయాంశం అయ్యింది. ఈ పాపను కొంతమంది వేధిస్తున్నారు అనేది ఆ కంప్లైంట్ యొక్క సారాంశం. దీంతో చాలా మంది ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పై లైంగిక దాడులు చేశారు అంటూ ప్రచారం చేశారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. అసలు విషయం వేరు. విషయం ఏంటంటే .. ‘గు’ అనే హారర్ సినిమా కోసం ఈ పాప పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చింది.
ఇందులో ఆ పాప మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ దారుణమైన థంబ్ నైల్స్ పెట్టారట. దీంతో ఈ పాప ట్రోలింగ్ జరుగుతుంది. మీమ్స్ కూడా చాలా ఘోరంగా వస్తున్నాయి. దీంతో ఆ పాప తట్టుకోలేకపోయిందట. ఆమె కెరీర్ ను దెబ్బతీసే విధంగా ఇలాంటి ఘోరమైన పోస్టులు పెట్టడం ఏంటి అని ఆ పాప తండ్రి ఆ ఛానల్స్ వారితో మాట్లాడినా.. వాళ్ళు వినలేదట. అందుకే పోలీసులను ఆశ్రయించాడట ఆ పాప తండ్రి.