‘అఖండ 2′(Akhanda 2) సినిమా గతవారం అంటే డిసెంబర్ 12న రిలీజ్ అయ్యింది. తొలి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది సినిమా ఓవర్ ది టాప్ అన్నట్టు ఉందని విమర్శించారు. అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయని.. దర్శకుడు బోయపాటి శ్రీను ఎక్కడా కూడా లాజిక్స్ ఫాలో కాకుండా ఇష్టం వచ్చినట్టు తీసేశారని.. ఇలా రకరకాలుగా విమర్శించారు. ఈ విమర్శలపై బోయపాటి స్పందించడం జరిగింది.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. “సినిమా అంటే లాజిక్ కాదు మేజిక్.నేను సినిమా స్టార్టింగ్లోనే చెప్పాను. మరి వాళ్లకి ఏం అర్థమైందో నాకు తెలీదు. అయినప్పటికీ గూగుల్ కి వెళ్లి అష్టసిద్ధి సాధన అని కొడితే అంతా తెలుస్తుంది. అష్టసిద్ధి సాధన సాదించినవాడు ఒక సూపర్ హ్యూమన్. అర్దశివుడు అంటారు. వాళ్ళు ఏదైనా చేయగలరు. కానీ నేను ఏమీ చేయలేదు. ఆయుధం మాత్రమే వాడుతూ చేయించాను.

ఒక అఘోర 14 ఏళ్ళ పాటు అష్టసిద్ధి సాధన సాధించి బయటకు వస్తే నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు. అతను కొట్టే దెబ్బ అయినా సరే, తీసే దిష్టి అయినా సరే ఆ పవర్ మీటర్ అలానే ఉంటుంది. దాన్ని గ్రహించకుండా ఒకటి, రెండు సన్నివేశాలు తీసుకుని ఏంటేంటో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అసలు సూపర్ పవర్స్ అంటేనే మనవి. ‘అవెంజర్స్’ వంటివి క్రియేట్ చేసినవి.
కానీ మనకి ఉన్నన్ని అవెంజర్స్ క్యారెక్టర్స్ ఇక ఎక్కడా లేవు” అంటూ క్లారిటీ ఇచ్చారు. బోయపాటి చెప్పిన విధానం కరెక్టే. కానీ ఆయన కామెంట్స్ తో ఎంతమంది ఏకీభవిస్తారు అంటే కచ్చితంగా సమాధానం చెప్పడం కష్టం.
