రామ్ చరణ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈ అమ్మాయి ఎంత పెద్ద హీరోయిన్ అయ్యిందో చూస్తే మతిపోతోంది!

నిన్న గాక మొన్న బాలనటులుగా చూసినట్టు అనిపించే ఎంతో మంది నేడు హీరోయిన్స్ గా హీరోలు గా మారి మన ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పిల్లలు చాలా ఫాస్ట్ గా పెరిగిపోతున్నారు, వారి ముఖం లో మార్పులు ప్రతీ ఏటా మారిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు రచ్చ సినిమాలో బాలనటిగా నటించిన విషికా లక్ష్మణ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిల్చిన ‘రచ్చ’ సినిమా అంటే మెగా అభిమానులకు ఎంత ప్రత్యేకమో మన అందరికీ తెలిసిందే.

మెగా ఫ్యామిలీ వరుస ఫ్లాప్స్ లో ఉన్న సమయం లో ఈ చిత్రం వచ్చింది. ఆరోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు తమన్నా చిన్నప్పటి పాత్రలు మన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇందులో తమన్నా చిన్నప్పటి క్యారక్టర్ చేసిన అమ్మాయి పేరు విషికా లక్ష్మణ్. ఈమె ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటి వరకు ఈమె ‘సగిలేటి కథ’, ‘ఏందిరా ఈ పంచాయితీ’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈమె బాలనటిగా కేవలం రచ్చ సినిమాలో మాత్రమే కాదు, అంతకు ముందు చాలా సినిమాల్లోనే నటించింది అట. అందులో ‘రచ్చ’ సినిమా ఆమెకి బాలనటిగా చివరి సినిమా అట.

ఈ సందర్భంగా రామ్ చరణ్ (Ram Charan) తో మీకు ఉన్న రిలేషన్ ఎలాంటిది అని అడగగా, దానికి రిషికా సమాధానం చెప్తూ రచ్చ సినిమాలో నాకు రామ్ చరణ్ మరియు తమన్నా గారితో సన్నివేశాలు లేవు, వాళ్ళిద్దరిని నేను షూటింగ్ లో చూసింది కూడా లేదు, ఇప్పుడు రామ్ చరణ్ గారు నన్ను చూస్తే గుర్తు పట్టలేరేమో, ముఖం లో చాలా మార్పులు వచ్చాయి కదా అని సమాధానం ఇచ్చింది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus