Akhanda Movie: అఖండపై చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకులు ఆసక్తికర వ్యాఖ్యలు

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను అందుకుని బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ను కేవలం అభిమానులు మాత్రమే కాకుండా పలువురు సెలబ్రిటీలు హిందుత్వ వాదులు కూడా మెచ్చుకున్నారు.హిందూ దేవాలయాల గురించి ధర్మం గురించి

వాటి ప్రాముఖ్యత గురించి గత కొంత కాలంగా కొందరు అవమానించే విధంగా మాట్లాడుతున్నారని వారికి ఆ విలువ తెలిసేలా అఖండ సినిమా అద్దం పట్టినట్లు వివరించినట్లు చెబుతున్నారు. ఈ సినిమాపై చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కూడా తన అభిప్రాయాన్ని చాలా వివరంగా తెలియజేశారు. సినిమాలు చూడడానికి అర్చకులు అంతగా ఆసక్తి చూపని రోజుల్లో ఆయన సినిమా చూసిన తర్వాత హిందూ ధర్మం గురించి అఖండ సినిమా చాలా అద్భుతంగా తెలియజేసిందని అన్నారు..

ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో అనే విషయాన్ని అఖండ సినిమాలో చూపించారు. ధర్మాన్ని రక్షించడం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది. ‘అహింసా ప్రథమో ధర్మః’ అనే వ్యాక్యాన్ని మనకి వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగ పరుస్తున్నారో అనే విషయాన్ని కూడా అద్భుతంగా చూపించడం జరిగింది. ధర్మం కోసం ఎంతకైనా తెగించవచ్చు అనే సిద్దాంతాన్ని చక్కగా అర్థమయ్యేలా చూపించడం జరిగింది. ఈ సినిమాకి పని చేసిన వారికి భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి.

ఈ సినిమాని చాలామంది ఎందుకు చూస్తున్నారూ అనే విషయంలోకి వెళితే చాలామంది మనసులో ధర్మాన్ని కాపాడాలని ఉక్రోషం ఉంది. ఆక్రోషం, తపన ఉంది. కానీ ఏమీ చేయలేకపోతున్నాము అనే ఆందోళనకరమైనటువంటి కోపం కూడా ఉంది. రాజ్యాంగం ఉన్నప్పటికీ మన ధర్మానికి అన్యాయం జరుగుతుంది. ఇక రామరాజ్య స్థాపన జరగాలని అందరి మనసుల్లో బలంగా ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము.. ఆ కారణంగా ఈ సినిమా మంచి విజయం సాధించింది అంటూ.. ఇది పాలకులు గుర్తించాలి.. అని వారు వివరణ ఇచ్చారు

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus