Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

  • July 27, 2025 / 10:23 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మేకర్స్ ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. పీపుల్ స్టార్ సందీప్ కిషన్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసి టీజర్ ని లాంచ్ చేశారు. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్‌, యాక్షన్‌, థ్రిల్ ,హ్యుమర్ ఎలిమెంట్స్ తో టీజర్ అదిరిపోయింది.

China Piece

టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈవెంట్ తో మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. టీమ్ అందరితో కలిసి ఈ టీజర్ ని సెలబ్రేట్ చేసుకోవడం వెరీ హ్యాపీ. నేను ఈవెంట్ కి రావడానికి కారణం నిహాల్. తను టీజర్ పంపించాడు. నాకు చాలా నచ్చింది. తను సినిమాని ప్రేక్షకుల వద్దకు చేరవేయానే ఆరాటం నాకు చాలా నచ్చింది. తను ఈ వేడుకలో మాట్లాడిన మాటలు కూడా నాకు చాలా నచ్చాయి. ఒక సినిమాను తీసి రిలీజ్ చేయడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు సినిమా నచ్చితే అదంతా బోనస్ అని భావించాలి. మన ఆలోచనల్ని దేశం మొత్తం చెప్పడానికి బెస్ట్ ప్రాసెస్ సినిమానే. ఫేమస్ అవ్వాలనుకుంటే రీల్స్ చేసి కూడా ఫేమస్ అవ్వచ్చు. ఇది ఒక స్పై ఫిల్మే కాదు స్పై కామెడీ, సీరియస్ కామెడీ కూడా ఉంది. దర్శకుడు ఈ కథని నమ్మాడు. నమ్మింది చిత్రీకరించాడు నిహాల్ సూర్య వీళ్ళందరిలోనూ ఒక నిజాయితీ ఉంది. తప్పకుండా ఆ నిజాయితీని మనందరం అప్రిషియేట్ చేయాలి. ఒక కొత్త ఫిలిం మేకర్స్ కొత్త నటించినప్పుడు ఆ సినిమాకు వెళ్లి వాళ్ళ ఆలోచన ని చూడడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా’అన్నారు

డైరెక్టర్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన సందీప్ కిషన్ గారికి ధన్యవాదాలు. మేము చాలా ఫ్యాషన్ తో ఈ సినిమాని క్రియేట్ చేశాను. కమల్ గారు కూడా ఈ సినిమాకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నారు. ఒక దేశభక్తి సినిమా తీస్తూ చైనా పీస్ అనే పేరు పెట్టడం వెరీ చాలెంజింగ్. మేము అన్ని విభాగంలోనూ జాగ్రత్తలు తీసుకుని చాలా చక్కగా ఈ సినిమాని తీర్చిదిద్దాం. సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి మీ అందరి సపోర్టు కావాలని కోరుకుంటున్నాను’అన్నారు.

హీరో నిహాల్ మాట్లాడుతూ..మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నేను నటించినా ఒక సినిమా చూసి సందీప్ కిషన్ గారు నా భుజాన చేయవేసి చాలా చక్కగా చేశావని మెచ్చుకున్నారు. ఆ క్షణం నేను మర్చిపోలేను. కష్టపడి సినిమాలు చేస్తే కచ్చితంగా సక్సెస్ వస్తుందనే దానికి సందీప్ కిషన్ గారు నిదర్శనం. తప్పకుండా ఆయనే మా సినిమా టీజర్ ని రిలీజ్ చేయాలని నేను బలంగా కోరుకున్నాను. ఆయన ఈ లాంచ్ రావడం నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నేను జగడంతో పాటు దాదాపు 20 సినిమాలు కి చైల్డ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశాను. అవన్నీ కూడా స్కూల్ బంక్ కొట్టడానికి చేశాను. కానీ యాక్టింగ్ అంటే మజా వచ్చింది. ఒక నమ్మకంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. సినిమా చేతికి రావడానికి రెండేళ్లు పట్టింది. నిజంగా కలలుకని దానికి 100% కష్టపడితే గొప్ప పనులన్నీ జరుగుతాయనే నమ్మకం కుదిరింది. ఒక్కొక్క సినిమా ఒక కొత్త వాయిస్ ని తీసుకురావాలి. డైరెక్టర్ విశ్వనాథ్ ఈ సినిమాతో అలాంటి ఒక కొత్త వాయిస్ ని తీసుకొస్తారు. తనకు కావాల్సింది వచ్చేంతవరకు ఎక్కడ రాజీపడరు. గ్రేట్ రైటింగ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఒక సాలిడ్ కమర్షియల్ సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలో అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు

హీరో సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. సందీప్ కిషన్ గారికి థాంక్యూ సో మచ్. విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మాట్లాడుతుంది మీ అందరికీ నచ్చుతుంది. బాగా రీచ్ అవుతుందని నమ్మకం ఉంది. నిహాల్ కి థాంక్యూ వెరీ మచ్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు

యాక్టర్ కమల్ కామరాజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విశ్వనాథ్ చాలా క్లియర్ విజయంతో ఉన్నాడు. తను చాలా పరిణీతితో ఈ సినిమాని తీర్చిదిద్దాడు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి దర్శకుడు దొరికాడు. స్పై సినిమాలో ఉండాల్సిన అన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. సినిమా షూటింగ్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నిహాల్ సూర్య అద్భుతంగా నటించారు. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు

హర్షిత మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాలో సారా అనే క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నాను. పర్ఫామెన్స్ కి చాలా స్కోప్ ఉండే క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా ఆనందంగా ఉంది. విశ్వనాధ్ రెడ్డి గారికి థాంక్యూ సో మచ్. నిహాల్ సూర్య అందరికీ థాంక్యూ సో మచ్. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు

దీక్ష పంత్ మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. చాలా రోజుల తర్వాత మళ్లీ స్క్రీన్ పైకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ విశ్వనాధ్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ద్వారా మీ అందరికీ మళ్లీ నచ్చుతానని భావిస్తున్నాను. సందీప్ కిషన్ గారికి థాంక్యూ. టీజర్ చాలా ప్రామిస్ గా ఉంది. సినిమాని బ్యూటిఫుల్ గా తీశారు.తప్పకుండా మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’అన్నారు.

నటీనటులు: నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, గులాసీ, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డి
బ్యానర్: మూన్ లైట్ డ్రీమ్స్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు
సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
పీఆర్వో: తేజస్వీ సజ్జా

40 ఏళ్ళ క్రితం చిరు.. 15 క్రితం పవన్..లను ఇబ్బంది పెట్టిన టైటిల్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #china piece
  • #Sundeep Kishan

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

15 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

17 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

6 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

11 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

11 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

12 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version