మన నితిన్ .. పవన్ కళ్యాణ్ రిఫరెన్సులు ఎక్కువగా తన సినిమాల్లో వాడుకుంటాడు.ఇది అందరికీ తెలిసిన సంగతే. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి రిఫరెన్సులు వాడుతూ ఉంటాడు. ‘చిరంజీవి తన అన్న కదా.. అతని ఫ్యాన్స్ ను కూడా ఆకర్షించి థియేటర్ కు రప్పించాలనే ఉద్దేశంతో పవన్.. చిరు రిఫరెన్సులు వాడుకుంటాడేమో’ అని యాంటీ ఫ్యాన్స్ అనుకోవచ్చు.
కానీ విషయం అది కాదు. పవన్ కళ్యాణ్ కి ఏ హీరో రిఫరెన్సులు వాడాల్సిన అవసరం లేదు. చిరంజీవి కంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేంజ్ పెద్దది. ఇప్పటి నుండి కాదు.. ‘తొలిప్రేమ’ నుండి చూసుకుంటే పవన్ క్రేజ్ చిరంజీవితో ఆల్మోస్ట్ ఈక్వల్ అనే చెప్పాలి. కానీ ‘తను ఎంత స్టార్ అయినప్పటికీ.. చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీకి వచ్చాను’ అనే విధేయతను తన సినిమాల ద్వారా తెలియజేయడానికి చిరంజీవి రిఫరెన్సులు వాడుతూ ఉంటాడు పవన్. మరో రకంగా చెప్పాలంటే మూలాలను మర్చిపోకుండా అనమాట.
సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. పవన్ కళ్యాణ్ వాడిన చిరంజీవి రిఫరెన్సుల్లో ‘పులి’ టైటిల్ ఒకటి.ఇది మాత్రం పవన్ కళ్యాణ్ కు కలిసి రాలేదు. 2010 లో వచ్చిన ‘కొమరం పులి’ సినిమా టైటిల్ ను కొన్ని కారణాల వల్ల ‘పులి’ గా మార్చారు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ మాటకి వస్తే చిరంజీవి కూడా ‘పులి’ టైటిల్ కలిసి రాలేదు అనే చెప్పాలి. 1985 లో చిరంజీవి హీరోగా రాజ్ భరత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ వచ్చింది. అదే ‘పులి’. ఇందులో కూడా చిరంజీవి పోలీస్ పాత్ర పోషించారు. కథ కూడా బాగానే ఉంటుంది. కానీ డైరెక్షన్ తేడా కొట్టడం వల్ల సినిమా నిరాశపరిచింది అని చెప్పాలి.