టాలెంటెడ్ ప్రేక్షకులు లవర్ బాయ్ గా పిలుచుకునే సిద్ధార్థ్ సరికొత్త పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘చిన్నా’. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాని ఎటాకి సంస్థ నిర్మించింది. ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. చిన్నాన్నకి, అతని అన్నయ్య కూతురుకి మధ్య ఉన్న అందమైన అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఎస్.యు.అరుణ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తమిళంలో `పన్నయారుం పద్మినియుం`, `సేతుపతి` సినిమాలతో డైరక్టర్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అతను.
మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ అయితే ఆ స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.15 cr
సీడెడ్
0.07 cr
ఉత్తరాంధ్ర
0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.32 cr
‘చిన్నా’ (Chinna) చిత్రానికి తెలుగులో రూ.2.05 థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సిద్దార్థ్ సినిమాలు ఈ మధ్య కాలంలో తెలుగులో బాగా ఆడినవి అంటూ ఏమీ లేవు. కానీ ఈ సినిమాపై అతను చాలా ఆశలు పెట్టుకున్నాడు.
అతను కోరుకున్నట్టు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ మొదటి వీకెండ్ కి ఈ మూవీ కేవలం రూ.0.32 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.18 కోట్లు షేర్ ను రాబట్టాలి. అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.