Chinna OTT: చిన్నా ఓటిటిలోకి ఎప్పుడంటే..!

ల‌వ‌ర్‌బాయ్ సిద్ధార్థ్ హీరోగా ఇటీవ‌ల వ‌చ్చిన‌ చిత్తా (చిన్నా,) చిత్రం దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా డిజిట‌ల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. స్వ‌యంగా సిద్ధార్థే నిర్మించిన ఈ సినిమాలో మ‌ళ‌యాళ న‌టి నిమిషా స‌జ‌య‌న్ క‌థానాయిక‌గా చేయ‌గా అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫ్యామిలీ డ్రామా, థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో రూపొందిన ఈ సినిమా విడుద‌లైన రోజు నుంచే అన్ని వ‌ర్గాల నుంచి సూప‌ర్ పాజిటివ్ టాక్‌తో కుటుంబ‌మంతా త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిన సినిమాగా మంచి పేరు తెచ్చుకుంది.

సిద్ధార్థ్‌ న‌ట జీవితంలోనే ఇది ఉత్త‌మ చిత్రం అంటూ విమ‌ర్శ‌కుల నుంచి సైతం ప్ర‌శంస‌లు అందుకున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మ‌రిల్లు, కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం వంటి స్ట్రెయిట్ సినిమాల ద్వారా ఫ్యామిలీ, యూత్ ఆడియ‌న్స్‌ల‌లో మంచి పేరు తెచ్చుకున్న స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న‌ సిద్ధార్థ్ ఆ త‌ర్వాత స‌రైన హిట్ లేక తెలుగు ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యాడు. అడ‌పాద‌డ‌పా త‌మిళంలో వ‌చ్చిన సినిమాల‌ను ఇక్క‌డ డ‌బ్ చేస్తూ వ‌చ్చినా ఆ స్థాయిలో హిట్ సాధించ‌లేక పోయాడు.

2022లో తెలుగులో శ‌ర్వానంద్‌తో క‌లిసి మ‌హాస‌ముద్రం సినిమా చేసిన అది ఆయ‌న కేరీర్‌కు ఉప‌యోగ‌ప‌డ లేదు. ఈ క్ర‌మంలో ఆయ‌నే స్వ‌యంగా నిర్మాత‌గా మారి త‌మిళంలో చిత్తా(చిన్నా) అనే చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించాడు. ఆపై త‌నే అన్ని రాష్టాల‌లో తిరుగుతూ ప్ర‌మోష‌న్స్ సైతం చేశాడు. చిన్నా గ‌తంలో క‌మ‌ల్‌హ‌స‌న్ క‌ల్ట్ చిత్రం మ‌హ‌న‌ది సినిమా ఛాయ‌ల‌తో ఉందంటూ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా త‌మిళంలో 5 వారాల పాటు న‌డిచింది.

బాబాయి , చిన్నారి అనే కూతురు మ‌ధ్య అనుబంధం, చిన్నారి కిడ్నాప్ ఇతివృత్తంలో రూ.4 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.16 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి మంచి విజ‌యం సాధించింది. త‌మిళ‌నాట క‌మ‌ల్‌హ‌స‌న్ వంటి స్టార్స్ ఈ సినిమాను చూసి ప్ర‌మోట్ చేయ‌డానికి స్వ‌యంగా ముందుకు రావ‌డం విశేషం. త‌మిళ్‌లో సెప్టెంబ‌ర్ 28న‌ విడుద‌లైన ఈ సినిమా తెలుగులో ఆల‌స్యంగా ద‌స‌రా స‌మ‌యంలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది.

ఇక్క‌డా చిత్రం (Chinna) మంచి టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ పెద్ద హీరోల‌ సినిమాలు విడుద‌ల నేప‌థ్యంలో తొల‌గించాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఈ సినిమాను త్వ‌ర‌లో డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు థియేట‌ర్ల‌లో మిస్ అయిన వారు త్వ‌ర‌లో ఓటీటీలో చూడండి అంటూ సిద్ధార్థ్ సోష‌ల్‌మీడియాలో ఓ పోస్టు పెట్టారు. కాగా దీపావ‌ళి సంద‌ర్భంగా ఈనెల 11న గానీ 16న‌గానీ ఓటీటీలో తెలుగు, త‌మిళ‌,క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నట్లు తెలుస్తున్న‌ది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus