Chiranjeevi, Aamir Khan: జనాలు క్లాప్స్… జై జైలు కొట్టే సినిమాలను మాత్రమే చేస్తాను: చిరంజీవి

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈయన ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండటమే కాకుండా తాజాగా అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాని తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని తన ఇంట్లో ప్రివ్యూ చూసిన మెగాస్టార్ ఈ సినిమాని తెలుగులో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానుంది.

విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా నటించగా నాగచైతన్య అమీర్ ఖాన్ పాత్రలో సందడి చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే అమీర్ ఖాన్ ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. ఆయన పాత్రలలో నటించడం అంటే కష్టతరమైన పని అని చెప్పాలి. ఈ క్రమంలోనే మెగాస్టార్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ తాను అమీర్ ఖాన్ చేసే క్యారెక్టర్ లో నాకు వస్తే నేను ఆ క్యారెక్టర్లు చేయనని చెప్పారు.

జనానికి ఏమి చేస్తే క్లాప్స్ కొడతారు… జై జైలు కొడతారో అలాంటి వాటిని మాత్రమే చేస్తానని మెగాస్టార్ వెల్లడించారు.ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus