Chiranjeevi: సినిమాల్లోకి రాకముందు మెగాస్టార్ నటించిన సీరియల్ ఇదే.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోగా భోళా శంకర్ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమాలో, వశిష్ట డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్న చిరంజీవి ఈ సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు మరిన్ని రికార్డులను ఖాతాలో వేసుకుంటారని అభిమానులు ఫీలవుతున్నారు. అయితే చిరంజీవి ఒక సీరియల్ లో నటించారనే విషయం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సినిమాల్లోకి రాకముందు చిరంజీవి (Chiranjeevi) రజినీ అనే పేరుతో తెరకెక్కిన టెలీ సీరియల్ లో నటించారని సమాచారం. ఈ సీరియల్ షూటింగ్ లో మెగాస్టార్ కొన్నిరోజుల పాటు పాల్గొన్నారని తెలుస్తోంది. ఆ తర్వాత సినిమా ఆఫర్లు రావడంతో చిరంజీవి సీరియల్ కు గుడ్ బై చెప్పారట. ఈ సీరియల్ ఏ ఛానల్ లో ప్రసారమైందనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్న చిరంజీవి ఒకప్పుడు సీరియల్ లో నటించి ఈ స్థాయికి ఎదిగారంటే నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు.

టాలెంట్ ఉంటే కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ కావడం సులువేనని చిరంజీవి ప్రూవ్ చేశారు. భాషతో సంబంధం లేకుండా సత్తా చాటుతున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరిగా ఉన్నారు. చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాతో పాటు త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఇతర భాషల ప్రొడ్యూసర్లు సైతం చిరంజీవితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. సినిమా సినిమాకు చిరంజీవి రేంజ్ పెరుగుతోంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus