“పరిగెడుతూ పాలు తాగడం కంటే.. నిలబడి నీళ్ళు తాగడం” అనేది చాలా ఉత్తమమైన పని. అందుకే సూపర్ స్పీడ్ గా వెళ్తున్న మన యంగ్ హీరోస్ కంటే.. కంటెంట్ కి వేల్యూ ఇస్తూ నిదానంగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకొన్న మన అగ్ర కథానాయకులు ఎప్పటికీ ఆదర్శప్రాయులుగానే నిలుస్తారు. అందుకే తన అల్లుడు సినిమా విషయంలో పడుతున్న కంగారును చూసి “కంగారు ఎందుకు కళ్యాణ్?” అని వారించాడట మెగాస్టార్ చిరంజీవి. ఆయన రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ “విజేత” చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడిన ఈ సినిమా తర్వాత ఒక మాస్ మసాలా సినిమాలో నటించాలని అల్లుడు కళ్యాణ్ దేవ్ కంగారుపడడం చూసిన చిరంజీవి ఇలా వదిలేస్తే ఎక్కడ అతడు చేజేతులా కెరీర్ ను నాశనం చేసుకోవడంతోపాటు.. మెగా కుటుంబానికి మచ్చలా నిలుస్తాడోనని భయపడి “ముందుగా నటన మీద కాన్సన్ ట్రేట్ చెయ్.. తర్వాత సినిమాలు చేయొచ్చు” అని హితబోధ చేశాడట. దాంతో సినిమా మొదలెడదామని అప్పటివరకూ కంగారుపడిన కళ్యాణ్ ఇప్పుడు యాక్టింగ్ స్కూల్ లో జాయినవ్వడానికి సిద్ధమవుతున్నాడట. మరి ఈ రెండో చిత్రంతోనైనా కథానాయకుడిగా నిలబడతాడేమో చూడాలి.