మెగాస్టార్ చిరంజీవికి సెన్సాఫ్ హ్యూమర్, స్పాంటేనిటీ ఎక్కువనే విషయం తెలిసిందే. అందుకే ఆయన సినిమాల్లో కామెడీ చేస్తే మిగిలిన హీరోలకు కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అది ఆయన సినిమాల్లో నటిస్తున్నప్పుడే కాదు.. బయట రెగ్యులర్ టైమ్‌లో కూడా ఉంటుంది అని అంటుంటారు. కొంతమంది నటులు చిరంజీవితో తమ అనుబంధం గురించి, బంధం గురించి చెప్పినప్పుడు ఈ విషయాలు బయటకు వస్తుంటాయి. అలా కొన్ని రోజుల క్రితం నటుడు, రచయిత, దర్శకుడు అయిన హర్షవర్ధన్‌కు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.
హర్షవర్ధన్ అంటే కొంతమంది తెలుస్తుంది.. అదే ‘అమృతం’ హర్ష అంటే అందరికీ తెలుస్తుంది. హాస్య నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రస్తుతం హర్షవర్ధన్ చాలా బిజీ. మధ్యలో తనలోని రచయితను, దర్శకుడిని బయటకు తీస్తున్నారు కూడా. ఆయన కొన్ని రోజుల క్రితం ‘మన శంకర వరప్రసాద్’ సినిమా షూటింగ్‌లో భాగంగా కలిశారట. ఆ సందర్భంలో ‘హర్ష.. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలయ్యా’ అన్నాడట. దాంతో హర్ష ఎమోషనల్ అయ్యారట.
‘నువ్వు నా పక్కన ఉంటేనే కదా.. నేనెంత సన్నగా, ఫిట్‌గా ఉన్నానో తెలిసేది’ అని ఆ ఎమోషనల్ మూమెంట్‌ని ఫన్నీగా కన్వర్ట్ చేసేశారట. దీంతో హర్షవర్థన్ కూడా నవ్వేశారట. ఆ తర్వాత ‘నువ్వు నా పక్కన లేకుంటే నేను బతకలేను మరి. నువ్వే నాకు దిక్కు. నాకు ఎవరూ లేరు’ అని ఆటపట్టించారు చిరంజీవి అని కూడా చెప్పుకొచ్చారు. దీంతో చిరంజీవి టైమింగే టైమింగ్ అంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
ఇక చిరంజీవి పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్మెంట్ జోన్‌లోకి వచ్చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారని సమాచారం. సీజన్ అయితే సినిమా టీమ్ చెప్పేసింది కానీ.. ఇంకా డేట్ ఫైనల్ చేయలేదు. త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరిపోతుంది అని సమాచారం. చూద్దాం మరి ఏ తేదీకి ‘శంకర్ ప్రసాద్’గారు వస్తారో?