నరేష్-శివాజీ రాజాల క్లాష్ కు కర్టెన్ దించనున్న చిరంజీవి

గత రెండ్రోజులుగా మా అసోసియేషన్ గురించి, మా అసోసియేషన్ లో జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అసోసియేషన్ కి వచ్చే సొమ్ములను దుర్వినియోగపరుస్తున్నారు అంటూ సీనియర్ నరేష్ ఆరోపించగా.. అందుకు సమాధానంగా శివాజీ రాజా-శ్రీకాంత్ లు ఒకవేళ నిధుల దుర్వినియోగం జరిగినట్లు ప్రూవ్ చేస్తే మా అసోసియేషన్ నుంచి తప్పుకోంటామంటూ సవాల్ విసిరారు. ఈ గొడవ కాస్త పెద్దదై చిరంజీవి పేరు కూడా మధ్యలోకి వచ్చింది. దాంతో చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి ఈ గొడవను సెటిల్ చేద్దామనుకొన్నారు. కానీ నరేష్ పేర్కొన్నట్లు మా అసోసియేషన్ లో నిధులను స్వప్రయోజనాల కోసం వినియోగించుకొన్నట్లు రుజువులు నరేష్ చూపడంతో చిరంజీవి కూడా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. నెక్స్ట్ ఈవెంట్ కి వస్తానని మాటిచ్చిన మహేష్ బాబు కూడా ఈ గొడవ కారణంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొన్నాడని వార్తలొస్తున్నాయి.

అయితే.. మా అసోసియేషన్ కి ఫౌండర్ మెంబర్ అయిన చిరంజీవి మాత్రం తనను అనవసరంగా మధ్యలోకి లాగినప్పటికీ అసోసియేషన్ పేరు పాడవుతుందన్న ఆలోచనతో ఈ ఇష్యూని సెటిల్ చేయాలని ఫిక్స్ అయ్యారట. మరి ఈ గొడవ సర్ధుమణగాలంటే అసలు నిజం బయటకైనా రావాలి లేదా బూస్థాపితం అయిపోవాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus