Chiranjeevi: ‘కాంపౌండ్‌’ కామెంట్లు.. చిరు అదిరిపోయే రిప్లై… ఏమన్నారంటే?

విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)  సినిమా ఈవెంట్‌కు చిరంజీవి (Chiranjeevi) రావడం ఏంటి? ఆయన వేరే హీరో కాంపౌండ్‌లోని వ్యక్తి కదా అంటూ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ ‘కాంపౌండ్‌’ కామెంట్‌కు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చి అడిగినాయనను చల్లబరిచాడు విశ్వక్‌. ఇప్పుడు చిరంజీవి కూడా ఆ ప్రశ్నకు డబుల్‌ స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చాడు. దీంతో కాంపౌండ్‌ ప్రశ్న అడిగి వ్యక్తికి మరోసారి కత్తి లాంటి ఆన్సర్‌ వచ్చినట్లు అయింది. ‘లైలా’  (Laila) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ వేదిక మీద ఇదంతా జరిగింది.

Chiranjeevi

ఈ మధ్య విష్వక్‌ సేన్‌ను ‘మీరు బాలకృష్ణ  (Nandamuri Balakrishna)  కాంపౌండ్‌ కదా.. మెగా కాంపౌండ్‌కు ఎలా వచ్చారు’ అని ఓ విలేకరి అడగడం విన్నాను. దానికి విశ్వక్‌ ‘మా ఇంటికి కాంపౌండ్‌ ఉంది కానీ, సినిమా పరిశ్రమకు లేదు’ అని చెప్పడం కూడా విన్నాను. భలే సమాధానం చెప్పాడు అని చిరంజీవి మెచ్చుకున్నారు. విశ్వక్‌ మన ఇండస్ట్రీలోని మనిషే. మన కుటుంబంలో ఒక్కడు. ఇండస్ట్రీ అంతా ఒక్కటే. అందుకే వచ్చాను అని చిరు అన్నారు.

మా ఇంట్లో మేమంతా కలిసే ఉంటాం. దాని వల్ల మా ఇమేజ్‌ ఏమీ తగ్గలేదు. ఈ రోజు ఏపీలో పవన్‌ కల్యాణ్‌ను (Pawan Kalyan)  చూస్తే అందరూ సంతోషిస్తున్నారు. దానికి నేను గర్వపడాలి. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయింది. దాన్నీ నేనెంతో గర్విస్తాను అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు చిరు. కొన్నిసార్లు సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ, కచ్చితంగా ఇండస్ట్రీలో ఆడిన ప్రతి సినిమా విషయంలో అందరూ హర్షించాలి అని చిరంజీవి చెప్పారు.

సినిమాపై ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయని, వాళ్ల కోసమైనా అందరూ హిట్‌ చిత్రాలు చేయాలని పిలుపునిచ్చారు. నిజానికి విశ్వక్‌ ఇప్పుడు బాలకృష్ణ మనిషి, ఎన్టీఆర్‌ (Jr NTR)  మనిషి అనే ట్యాగ్‌లైన్‌తో కనిపిస్తున్నాడు. తొలి రోజుల్లో చిరంజీవి కుటుంబంతోనూ దగ్గరగానే ఉండేవాడు. నిహారిక (Niharika)  సినిమా ప్రెస్‌ మీట్‌ కూడా వచ్చాడు. కాబట్టి తాను ఎప్పుడూ అందరివాడుగానే ఉండాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus