Chiranjeevi: ఐరన్‌లెగ్‌ అంటారేమోనని భయపడ్డా: చిరంజీవి కామెంట్స్‌ వైరల్‌!

యువ హీరో చిరంజీవి.. సుప్రీం హీరో చిరంజీవి.. మెగాస్టార్‌ చిరంజీవి – ఇదీ చిరంజీవి ప్రస్థానం. దీని వెనుక ఆయన కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతమంది చెప్పినా తక్కువే. అయితే ఆయన తన గురించి చెబుతుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇంకా చెప్పాలంటే మనకు తెలియని చాలా విషయాలు తెలుస్తాయి. అలాంటి కొన్ని విషయాలు చిరంజీవి ఇటీవల ఓ కార్యక్రమానికి వచ్చినప్పుడు చెప్పారు. అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆప్త) వారి ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో ‘క్యాటలిస్ట్‌ గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌ – 2025’ అనే కార్యక్రమం జరిగింది.

Chiranjeevi

దానికి చిరంజీవి (Chiranjeevi)  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదిక మీదే తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో కష్టాలు ఎదురవుతున్నప్పుడు నెంబరు 1 అవ్వాలని ఫిక్స్‌ అయ్యానని, ఆ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు చిరంజీవి. రామారావు (Sr NTR)  గారితో కలిసి ‘తిరుగులేని మనిషి’ సినిమాలో నటిస్తే అది ఫ్లాప్‌ అయిందని, ఆ తర్వాత ఆయనతో కలిసి నటించే అవకాశం మరోసారి వచ్చినా.. వేరొకరిని తీసుకున్నారని..

ఎందుకు అని అడిగితే.. ‘మీ కాంబోలో వచ్చిన సినిమా సక్సెస్‌ కాలేదు కదా. అందుకే వద్దనుకున్నాం అని చెప్పారని చిరంజీవి నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తనతో సినిమా చేస్తే ఆడదనే ప్రచారం జరిగే పరిస్థితి కూడా వచ్చిందన్నారు.అంతేకాదు ఆ రోజుల్లో తనను ఐరన్‌లెగ్‌ అంటారేమోనని కూడా భయపడ్డానని చిరు చెప్పారు. అంతేకాదు తనను వద్దన్న ఆ దర్శకుడితో ఆ తర్వాత ఎక్కువగా సినిమాలు చేశా అని చెప్పారు.

ఆ డైరెక్టర్‌తో రికార్డులూ ఉన్నాయని చెప్పారు. ఇండస్ట్రీలో కాలర్‌ ఎగరేస్తే ఏమవుతుందో తనకు తెలుసని, అందుకే అణిగిమణిగి ఉంటూ నెంబరు 1 అనే మాటను మనసులోంచి తీసేశానని చెప్పారు. ఆయన మనసులోంచి తీసేసినా.. ఇప్పుడు ఆయన నెంబర్‌ వన్‌గా ఎదిగారు. అంటే ఎదగాలి అని అనుకుంటే నెంబర్‌ 1 అవ్వాలనే ఆలోచన ఓసారి వచ్చినా చాలు అని చిరంజీవిని చూస్తే అర్థమవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus