అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 250 కోట్లు కావడం విశేషం. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, అనుష్క, తమన్నా,నిహారిక వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం మెగా అభిమానుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవ‌లే ‘సైరా’ షూటింగ్ పూర్తయ్యింది కాబట్టి.. డ‌బ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి . ఈ చిత్రం పూర్తయ్యాక మెగాస్టార్ తన 152వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. వ‌చ్చే వార‌మే ఆ చిత్రం మొదలు పెట్టాలని భావిస్తున్నారట. దీంతో .. `సైరా` డ‌బ్బింగ్‌ కార్యక్రమాల్ని త్వరగా పూర్తి చేసేయాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారంట. దీంతో వెంటనే డబ్బింగ్ స్టార్ట్ చేసిన చిరు కేవ‌లం 20 గంట‌ల్లోనే పూర్తి చేసేసారట. ఇందులో ఎలాగూ డైలాగ్ పార్ట్ చాలా ఎక్కువ‌ కాబట్టి… తన టాలెంట్ ను ఉపయోగించి ఇంత త‌క్కువ స‌మ‌యంలోనే డబ్బింగ్ పూర్తి చేసేసారట మెగాస్టార్. ఏమైనా చిరు స్పీడ్ కి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే. ఇక ‘సైరా’ చిత్రం అక్టోబర్ 2 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus