బాబోయ్… ఆ డైరెక్టర్ తో వద్దు అంటున్న మెగా ఫ్యాన్స్…!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రమైన ‘ఆచార్య’ తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మొదట ఆగష్టు లో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేసారు కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఈ చిత్రం పూర్తయ్యాక తన తరువాతి సినిమాలు ఏ డైరెక్టర్స్ తో చేసేది.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఇది గుడ్ న్యూసే అయినప్పటికీ… ఆ డైరెక్టర్స్ లిస్టు లో మెహర్ రమేష్ కూడా ఉండడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తన 153 వ చిత్రమైన ‘లూసీఫర్’ రీమేక్ ను సుజీత్ డైరెక్షన్లో చేయబోతున్నట్టు తెలిపిన మెగాస్టార్.. తరువాత 154 ను బాబీ డైరెక్షన్లో అలాగే 155 మెహర్ రమేష్ డైరెక్షన్లో చేయబోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. ‘కంత్రి’ ‘బిల్లా’ వంటి సినిమాలతో పర్వాలేదు అనిపించిన మెహర్ రమేష్ ఆ తరువాత ‘శక్తి’ ‘షాడో’ వంటి స్ట్రోక్ లతో నిర్మాతలనే కాకుండా ప్రేక్షకుల్ని కూడా బేమ్భేలెత్తించాడు. వాటి దెబ్బకు… మీడియం రేంజ్ ఉన్న హీరోలు అలాగే చిన్న హీరోలు కూడా ఈయనతో సినిమా చెయ్యడానికి ముందుకు రాలేదు.

Chiranjeevi Confirms Film With Meher Ramesh1

ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ మహేష్ బాబు కనీసం తన భావ సుధీర్ తో కూడా సినిమా చెయ్య నివ్వడం లేదు. అలాంటిది మెగాస్టార్ ఎలా ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు అనేది ఆలోచనలో పడేసే విషయం. చెప్పినంత మాత్రాన కచ్చితంగా సినిమా చేస్తారు అని కూడా చెప్పలేము లెండి.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus